సాధార‌ణంగా స్మార్ట్‌‌ఫోన్‌లలో స్టోరేజ్ స్పేస్ కీలక పాత్ర పోషిస్తుంది. ఫోన్‌లలో స్టోరేజ్ స్పేస్ ఎంత ఎక్కువుగా ఉంటే అంత మంచిది. స్మార్ట్‌ఫోన్‌లలో అవ‌స‌రంలేని డేటాను ఎప్పటికప్పుడు తొలగించుటం ద్వారా స్టోరేజ్ స్పేస్‌‍‌ను పెంచుకోవచ్చు. అయితే కొన్ని యాప్స్ ఫోన్‌తో పాటుగానే వ‌స్తుంటాయి. అవి మ‌నం డౌన్‌లోడ్ చేసుకున్న యాప్స్‌లాగా డిలీట్ చేయ‌డం కుద‌ర‌వు. మ‌రి అవి ఎలా డిలీట్ చేయాలి అన్నది ఇప్పుడు తెలుసుకుంది. ముందుగా దీనికోసంఫోన్‌లోని డ‌వ‌ల‌ప్ప‌ర్ ఆప్ష‌న్‌ను ఎనేబుల్ చేసుకోవల్సి ఉంటుంది. ఫోన్ సెట్టింగ్‌.. అబౌట్ ఫోన్‌.. బుల్డ్ నెంబ‌ర్ పై 7 నుంచి 10 సార్లు టాప్ చేయటం ద్వారా  డ‌వ‌ల‌ప్ప‌ర్ ఆప్ష‌న్ ఎనేబుల్ అవుతుంది.

 

మరోసారి ఫోన్ సెట్టింగ్స్ ఓపెన్ చేసినట్లయితే డ‌వ‌ల‌ప్ప‌ర్ ఆప్ష‌న్‌ కనిపిస్తుంది. ఇప్పుడు డెవలపర్ ఆప్షన్‌ ఓపెన్ చేసినట్లయితే, మీకు USB Debugging పేరుతో మరో ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని కూడా ఎనేబుల్ చేసుకోండి. ఇప్పుడు మీ విండోస్ పీసీలో Debloater టూల్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోండి. ఈ టూల్ మీ ఆండ్రాయిడ్ డివైస్‌లోని సిస్టం యాప్స్‌ను రిమూవ్ చేయగలదు. ఇప్పుడు మీ విండోస్ పీసీలో Debloater టూల్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోండి. 

 

ఈ టూల్ మీ ఆండ్రాయిడ్ డివైస్‌లోని సిస్టం యాప్స్‌ను రిమూవ్ చేయగలదు. యూఎస్బీ కేబుల్ ద్వారా మీ ఆండ్రాయిడ్ డివైస్‌ను పీసీకి కనెక్ట్ చేయండి. Debloater టూల్ మీ డివైస్‌ను డిటెక్ట్ చేసేంత వరకు వెయిట్ చేయండి. డివైస్ డిటెక్ట్ అయిన వెంటనే మీ ఫోన్‌లోని యాప్స్ మొత్తం స్కాన్ కాబడతాయి. వాటిలో ప్రీ ఇన్‌స్టాల్డ్ యాప్స్‌ను మార్క్ చేసుకుని అప్లై బటన్ పై క్లిక్ చేసినట్లయితే అవి రిమూవ్ కాబడతాయి.

 
 
 
 
 
 
  
  

మరింత సమాచారం తెలుసుకోండి: