కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాల‌నుకుంటున్నారా..? అయితే ఇదే మీకు స‌రైన స‌మ‌యం. ఎందుకంటే చైనీస్ మొబైల్ మేకర్ షియోమీ సబ్‌బ్రాండ్ పోకో నుంచి మరో సరికొత్త ఫోన్ భారత మార్కెట్లోకి వచ్చేసింది. ‘పోకో ఎక్స్2’ పేరుతో పోకో ఇండియా జనరల్‌ మేనేజర్‌ మన్మోహాన్‌ చండొలు ఆవిష్కరించారు. షావోమీ నుంచి పోకో ఎఫ్1 వచ్చి ఏడాది గడిచిపోయినా ఇప్పటికీ ఈ ఫోన్‌కు మంచి రివ్యూస్ ఉన్నాయి. అందుకే పోకో ఎఫ్1 అప్‌గ్రేడ్ మోడల్ పోకో ఎఫ్2 ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు పోకో ఫ్యాన్స్. 

 

అయితే పోకో ఎఫ్2 పేరుతో వస్తుందనుకున్న ఫోన్ పోకో ఎక్స్2 పేరుతో ఇండియాలో రిలీజైంది. ఈ ఫోన్‌లో 120Hz రియాలిటీ ఫ్లో డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 730G ఎస్ఓసీ, డ్యూయల్ సెల్ఫీ కెమెరా వంటివి ఉన్నాయి. 27W ఫాస్ట్ చార్జింగ్, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. అలాగే  మూడు వేరియంట్లలో పోకో ఎక్స్‌2 మోడల్‌ను పరిచయం చేసింది పోకో ఇండియా. ఇక ధ‌రలు చూస్తే.. 6జీబీ+64జీబీ- రూ.15,999, 6జీబీ+128జీబీ- రూ.16,999 మ‌రియు 8జీబీ+256జీబీ- రూ.19,999గా నిర్ణ‌యించారు. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్, ఈఎంఐ ద్వారా కొంటే రూ.1,000 తగ్గింపు లభిస్తుంది. 

 

ఫిబ్రవరి 11 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో పోకో ఎక్స్‌2 అందుబాటులో ఉంటుంది. ఇక ఫీచ‌ర్ల విష‌యానికి వ‌స్తే..  6.67 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్ రియాలిటీ ఫ్లో 120Hz డిస్‌ప్లే, ‘ఇంటెలిజెంట్ డైనమిక్ రీఫ్రెష్ రేట్’ టెక్నాలజీతో కూడిన ఎల్‌సీడీ డిస్‌ప్లే ప్యానల్, ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 730G ఎస్ఓసీ, లిక్విడ్ కూల్ టెక్నాలజీ, 64ఎంపీ+8ఎంపీ+2ఎంపీ+2ఎంపీ క్వాడ్ రియర్ కెమెరా, 20 ఎంపీ+2ఎంపీ డ్యూయల్ సెల్ఫీ కెమెరా, 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: