వాట్సప్... పరిచయం అక్కర్లేని ఇన్‌స్టాంట్ మెసేజింగ్ యాప్. ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్‌ను సొంతం చేసుకున్న వాట్సాప్ ఎప్ప‌టిక‌ప్పుడు యూజ‌ర్ల‌ను అక‌ర్షించేందుకు కొత్త కొత్త ఫీచ‌ర్ల‌ను ప్ర‌వేశ‌పెడుతుంటుంది. మెసేజులు పంపడానికి, వాయిస్, వీడియో కాల్స్ చేయడానికి, ఫోటోలు, డాక్యుమెంట్లు షేర్ చేసుకోవడానికి ఈ యాప్ ను విపరీతంగా వాడుతున్నారు. అలా ఇన్‌స్టెంట్ మెసేజింగ్ ప్రపంచంలోకి పెను ఉప్పెనలా దూసుకొచ్చిన వాట్సాప్‌ను రకరకాల కమ్యూనికేషన్ అవసరాల దృష్ట్యా ప్రతిరోజు కోట్ల‌లో యూజర్లు వినియోగించుకుంటున్నారు. 

 

వాట్సాప్ చాటింగ్ హిస్టరీని సింగిల్ క్లిక్‌తో ఎలా తెలుసుకోవచ్చు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. మీకు మెసేజ్ స‌ర్చ్ ఆప్ష‌న్ తెలిసే ఉంటుంది. ఈ సెర్చ్ ఫీచర్ ద్వారా మీ వాట్సాప్ చాటింగ్ హిస్టరీని సింగిల్ క్లిక్‌తో తెలుసుకోవచ్చు. ముందుగా ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి లేటెస్ట్ వర్షన్ వాట్సాప్ యాప్‌ను తమ ఫోన్‌లలో ఇన్‌స్టాల్ చేసుకోవల్సి ఉంటుంది. ఆ తరువాత యాప్‌ను లాంచ్ చేసి చాట్ విండో టాప్ రైటర్ కార్నర్‌లో కనిపించే సెర్చ్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.

 

ఆ సెర్చ్ బార్‌లో మీరు చాటింగ్‌లో ఎక్కువ ఉపయోగించే సెంటెన్స్ లేదా పదాన్ని టైప్ చేయండి. ఇప్పుడు మీరు టైప్ చేసిన పదాలతో ఉన్న చాటింగ్ హిస్టరీ స్ర్కీన్ పై ప్రత్యేక్షమవుతుంది. వాటిలో మీకు కావల్సిన హిస్టరీ రిజల్ట్‌ను పొందవచ్చు. ఒకవేళ మీరు చాటింగ్ హిస్టరీని ఎప్పటికప్పడు డిలీట్ చేస్తున్నట్లయితే పాత రిజల్ట్స్ కనిపించవు.

మరింత సమాచారం తెలుసుకోండి: