ఇటీవ‌ల కాలంలో వాట్సాప్‌, ఫేస్‌బుక్ వినియోగంతో పాటు ట్విట‌ర్ వినియోగం కూడా బాగా పెరిపోతోంది. అలు పొలిటిక‌ల్ లీడ‌ర్స్‌.. ఇటు యువ‌త విసృతంగా ట్విట‌ర్ ఉప‌యోగిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఒక బ్లాగ్ పోస్ట్‌లో తప్పుదోవ పట్టించే వార్తల వ్యాప్తిని అరికట్టేందుకు ట్విటర్‌ గట్టి చర్యలు తీసుకుంటోంది ప్రకటన చేసింది.  #TwitterPolicyFeedback అనే హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగించి కొత్త విధానాన్ని  సంబంధించి ముందే ఇది వినియోగదారుల అభిప్రాయాన్ని సేకరించిందని తెలిపింది.

 

ఇందులో భాగంగా ఇలాంటి ట్వీట్‌లకు ప్రత్యేక ముద్ర వేయనుంది. ప్రజలకు హానిచేసే విధంగా ఉన్నాయని భావించిన పక్షంలో సదరు ట్వీట్‌లను పూర్తిగా తొలగించేందుకు ట్విటర్‌ చర్యలు తీసుకుంటుంది.  ట్విట్టర్లో ట్వీట్  చేసే ప్రతి వీడియో లేదా ఫోటోను లేబల్ చేస్తుంది. అందు వల్ల తప్పుడు వార్తలను  వ్యాపించకుండా అరికట్టనుంది. తెలిసో తెలియకో తప్పుదోవ పట్టించేలా రూపొందించిన మీడియా, ట్వీట్‌లను షేర్‌ చేయదల్చుకునే యూజర్లను ముందస్తుగా హెచ్చరించేలా సాంకేతికతను ఉపయోగించనుంది. 

 

ఇందులో భాగంగా ప్రజల భద్రతను పై ప్రభావం చూపించే లేదా తీవ్రమైన హాని కలిగించే వీడియో లేదా ఫోటో ట్విట్లను వెంటనే తీసివేయబడతాయి అని తెలిపింది. ఈ విషయం గురించి యూజర్లకు మరింత వివరంగా తెలిసేందుకు సదరు పోస్ట్‌లపై వివరణ పొందుపర్చనుంది. ఇక మార్చి 5 నుంచి తప్పుడు ట్వీట్లను లేబులింగ్‌ చేసే ప్రక్రియ ప్రారంభించనున్నట్లు ట్విటర్‌ వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: