చైనాకు చెందిన మొబైల్‌ తయారీ సంస్థ రియల్ మీ భారత మార్కెట్లో దూసుకెళ్తోంది. వినియోగదారులను ఆకట్టుకునేలా తన వస్తువులను తయారు చేసి మిగితా కంపెనీలకు గట్టిపోటీనే ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా అతి త‌క్కువ ధ‌ర‌కే మరో కొత్త బడ్జెట్‌ ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. గతంలో మంచి ఆదరణ పొందిన సీ2కు కొనసాగింపుగా రియల్‌మీ సీ3 పేరిట కొత్త మొబైల్‌ను తీసుకొచ్చింది.  సీ సిరీస్‌లో రియల్‌మీ నుంచి వచ్చిన మూడో స్మార్ట్‌ఫోన్ ఇది.

 

5,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, మీడియాటెక్ హీలియో జీ70 ప్రాసెసర్ లాంటి ప్రత్యేకతలున్నాయి. 3జీబీ+32జీబీ, 4జీబీ+64జీబీ వేరియంట్లలో ఈ ఫోన్ రిలీజైంది. రియల్‌మీ యూఐతో వస్తున్న మొదటి స్మార్ట్‌ఫోన్ కూడా ఇదే.  వీటిని ఆన్‌లైన్ వ్యాపార దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ద్వాారా అమ్మకాలు జరపనున్నారు. ఈనెల 14 నుంచి వీటిని అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. ఆఫ్‌లైన్‌ స్టోర్లల్లో ఫిబ్రవరి 20 నుంచి అందుబాటులో ఉంటుంది. మొదటి సేల్‌లో ఎక్స్‌ఛేంజ్ ద్వారా ఈ ఫోన్ కొనేవారికి అదనంగా రూ.1,000 తగ్గింపు లభిస్తుంది. 

 

ఇక ఫీచ‌ర్ల విష‌యానికి వ‌స్తే.. . 6.5 అంగుళాల హెచ్‌డీ+ వాటర్‌డ్రాప్‌ నాచ్‌ డిస్‌ప్లే, 3జీబీ, 4జీబీ ర్యామ్‌, 32జీబీ, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌, మీడియాటెక్ హీలియో జీ70రియర్ ప్రాసెసర్, 12+2 మెగాపిక్సెల్ కెమెరా, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ని అందిస్తోంది. అంతేకాకుండా డ్యూయెల్ సిమ్+ఎస్‌డీ కార్డ్, ఆండ్రాయిడ్ 10 + రియల్‌మీ యూఐ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఉన్నాయి. ఇక 3జీబీ+32జీబీ ధ‌ర రూ.6,999 కాగా, 4జీబీ+64జీబీ ధ‌ర రూ.7,999గా నిర్ణ‌యించారు. అలాగే బ్లేజింగ్ రెడ్, ఫ్రోజెన్ బ్లూ క‌ల‌ర్స్‌లో అందుబాటులో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: