చైనాకు సంబంధించిన మొబైల్ కంపెనీలు షియోమీ, హువావే, ఒప్పో, వివోలు అన్నీ చేతులు ఇప్పుడు కలిపాయి. ఈ పరిణామం ఇప్పుడు గూగుల్ కి ముప్పుగా పరిణమించనున్నాయి. న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ రాసిన కథనం ప్రకారం ఈ 4 కంపెనీలు చేతులు కలిపి ఓ ప్లాట్ ఫాంను తాయారు చేస్తున్నాయి. దీనితో చైనా బయట దేశాల్లో ఉన్న డెవలపర్స్ తమ యాప్స్ ను ఈ బ్రాండ్లకు సంబంధించిన ప్లేస్టోర్లలోకి ఎక్స్ పోర్ట్ చేసుకోవచ్చు. అసలు ఇంతకీ ఈ 4 కంపెనీలూ కలిసి ఏం చేయబోతున్నాయి? ఈ విషయం ఆండ్రాయిడ్ పై వీటి ప్రభావం ఎలా ఉండనుందో ఇప్పుడు చూద్దాం.

 

Image result for vivo, mi, oppo, huwai

 

అయితే ఇప్పటి వరకు ఈ యాప్ స్టోర్ కూటమికి గ్లోబల్ డెవలపర్ సర్వీస్ అలయన్స్ అని పేరు పెట్టారని సమాచారం. ఇందులో ఒప్పో, వివో, షియోమీ, హువావే కంపెనీలు ఉన్నాయి. గేమ్స్, మ్యూజిక్, మూవీస్ సంబంధిత, ఇంకా ఇతర యాప్స్ ను తయారు చేసే డెవలపర్లు తమ యాప్స్ ని వీటికి సంబంధించిన యాప్ స్టోర్లలో ఉంచవచ్చు. అయితే ఈ కంపెనీల లక్ష్యం మాత్రం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న గూగుల్ ప్లేస్టోర్ ఆధిపత్యాన్ని సవాల్ గా చేయడమే. దీనితోపాటు గూగుల్ ఎకో-సిస్టం మీద ఎక్కువగా ఆధారపడటాన్ని తగ్గించి ప్రపంచ మార్కెట్లో ఈ సాఫ్ట్ వేర్ ని ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడం.

 

 

అయితే ఈ నాలుగు స్మార్ట్ ఫోన్ బ్రాండ్లు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 40.1 శాతం మార్కెట్ షేర్ ను ఇవి కలిగి ఉన్నాయి. గత సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఇరవై శాతం మార్కెట్ షేర్ తో యాపిల్ ముందంజలో ఉండగా, వివో, ఒప్పో, షియోమీ, హువావేలు గూగుల్ ప్లేస్టోర్ ను ఉపయోగించడం ఆపేస్తే గూగుల్ ఒకేసారి ఏకంగా 60 శాతం మార్కెట్ ను కోల్పవలిసి వస్తుంది.

 

 

ఇవన్నీ ఇలా ఉండగా హువావే ఇప్పటికే గూగుల్ తో సంబంధం లేకుండా తన సొంత ఆపరేటింగ్ సిస్టంను తయారు చేసుకునే పనిలో మునిగిపోయింది. దీనికి హార్మొనీ ఆపరేటింగ్ సిస్టం అని పేరు కూడా పెట్టేసారు. గూగుల్ కు పోటీనివ్వాలనే ఒకే ఒక్క లక్ష్యంతో ఈ ఆపరేటింగ్ సిస్టంను వారు రూపొందిస్తున్నారు. రాయిటర్స్ నివేదిక ప్రకారం హాంగ్ కాంగ్ దేశానికి చెందిన ఆండ్రాయిడ్ ఎకో-సిస్టం ప్లాట్ ఫాం వాంకా ఆన్ లైన్ కూడా ఈ నాలుగు కంపెనీలతో చేతులు కలిపే ఎక్కువుగా ఉంది. 

 

 

కాకపోతే ఒప్పో, వివో, హువావే, షియోమీల ముందున్న అతి పెద్ద సవాల్ ఏమిటి అనగా గతంలో ప్లేస్టోర్ కు పోటీగా చేసిన ప్రయోగాలేవీ ఫలించక పోవడమే. కనుక మొదట్లో ప్రతికూల ఫలితాలు వచ్చినా పట్టువదలకుండా ఈ నాలుగు కంపెనీలూ ఒకే మాటపై నిలబడాల్సి వస్తుంది. కానీ అది జరుగుతుందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. 

మరింత సమాచారం తెలుసుకోండి: