సైబర్ మోసగాళ్లు రూటు మార్చారు. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం యూజర్లను టార్గెట్ చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు. కొత్తకొత్త పద్దతుల ద్వారా మోసాలు చేస్తూ వినియోగదారుల డబ్బులు కాజేస్తున్నారు. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లకు ఈ మద్య కాలంలో యూపీఐ మోసాలకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. ఉన్నతస్థాయి ఉద్యోగాలు చేసేవారు, లక్షల్లో సంపాదిస్తున్నవారే మోసాలపాలవుతూ ఉండటం గమనార్హం. 
 
చాలామంది గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం కస్టమర్లకు సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి బ్యాంక్ ఖాతా, ఓటీపీకి సంబంధించిన వివరాలను తెలుసుకొని మోసాలకు పాల్పడుతున్నారు. బ్యాంకులు ఇప్పటికే ఓటీపీ నంబర్లను ఎవరికీ చెప్పవద్దని అవగాహన కల్పించాయి కానీ సైబర్ మోసగాళ్ల మాయమాటలు వినియోగదారులు మాత్రం మోసపోతూనే ఉన్నారు. సైబర్ నేరగాళ్లు ఎక్కువగా తాము బ్యాంకు అధికారులమని నమ్మించి మోసాలకు పాల్పడుతున్నారు. 
 
గూగుల్ పే, పేటీఎం యాప్స్ ఉపయోగించేవారు ఎట్టి పరిస్థితులలోను ఓటీపీ వివరాలను ఎవరికీ చెప్పకూడదు. ఎవరైనా ఆఫర్లు, లక్కీ డ్రా అని ఫోన్ చేస్తే వారు మోసగాళ్లని గుర్తించాలి. బ్యాంకు నుండి ఎవరైనా కాల్ చేశామని చెబితే నిజంగా బ్యాంకు ఖాతాలో సమస్య ఉంటే బ్యాంకుకే వెళ్లి సమస్య పరిష్కరించుకోవటం ఉత్తమం. సైబర్ నేరగాళ్లు ఎనీ డెస్క్, టీమ్ వ్యూయర్ లాంటి యాప్స్ డౌన్ లోడ్ చేసుకోమని చెబితే అలాంటి యాప్స్ వలన మన మొబైల్ కు సంబంధించిన సమాచారం అవతలివారికి తెలుస్తుందని గుర్తుంచుకోవాలి. ఎట్టి పరిస్థితులలోను బ్యాంకు ఖాతా వివరాలను, యూపీఐ సంబంధిత వివరాలను అపరిచితులకు చెప్పకూడదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: