ఏంటి ? నోకియా ఫోన్ ఉపయోగించే వారికీ శుభవార్త? నోకియా వినియోగదారులకు కూడా శుభవార్తలు ఉంటాయా? అని మీకు ఆశ్చర్యం వెయ్యచ్చు.. కానీ శుభవార్తలు ఉంటాయి. ఆ శుభవార్త ఏంటి అంటే? నోకియా ఫోన్లలో నోకియా 9 ప్యూర్ వ్యూ, నోకియా 8 సిరోకో, నోకియా 8.1, నోకియా 7.2, నోకియా 7.1, నోకియా 7 ప్లస్, నోకియా 6.2, నోకియా 6.1 ప్లస్, నోకియా 6.1 ఫోన్లు వంటి ఫోన్లు ఉపయోగించే వారు జియో వినియోగదారులు వాయిస్ ఓవర్ వైఫై కాలింగ్ ఫీచర్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. 

 

అయితే ఒక్క నోకియా 7.2 ఫోన్ తప్ప అన్ని ఫోన్లు కూడ ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌తోనూ పనిచేస్తాయి. అయితే ఈ ఫీచర్ వినియోగించాలంటే.. ఓఎస్‌ను కొత్త వెర్షన్‌కు అప్‌డేట్‌ చేసుకోవాలి.. ఆ తర్వాత వినియోగదారులు మొదట సెట్టింగ్స్ కి వెళ్లి వైఫై కాలింగ్ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకోవాలి.. అప్పుడు వీవోఎల్‌టీఈ, వైఫై కాలింగ్ రెండిటిలో ఎనేబుల్ ఉంచుకుంటే మంచిది. 

 

ఎందుకుంటే.. ఆ ఆప్షన్ ఎనేబుల్ వల్ల వైఫై సిగ్నల్స్ ఎప్పుడైనా తక్కువగా ఉంటె మొబైల్ నెట్‌వర్క్‌తో కాల్స్ చేసుకోవచ్చు. ఏది ఎమైనా.. ఈ ఆప్షన్ అనేది ఒకరంగా నోకియా వినియోగదారులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక నుండి నోకియా ఫోన్ వినియోగదారులు కూడా వైఫై కాలింగ్ ని వినియోగించేస్తారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: