మనిషి జీవితంలో స్మార్ట్‌ఫోన్‌ ఒక భాగమైపోయింది. మెలకువగా ఉంటే చేతిలో, నిద్రపోతే పక్కలో ఫోన్‌ ఉండాల్సిందే. దీంతోపాటు కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, కెమెరాల వాడకమూ పెచ్చరిల్లిపోతున్నాయి. ఇక ఎక్కడ చూసినా మొబైల్‌ ఫోన్లే. సమాచారమైనా, చేస్తున్న ఉద్యోగం, వ్యాపారం, ఏ పనైనా కావచ్చు. ఫోను లేకుండా రోజు గడవడం కష్టమే. కాలాగుణంగా మారిన మార్పులతోపాటు, అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ పుణ్యమా అని స్మార్ట్‌ ఫోన్లు సైతం అందుబాటులోకి వచ్చాయి. అయితే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లను స్టోరేజ్ స్పేస్ సమస్యలు ప్రధానంగా వేధిస్తున్నాయి. 

 

ముఖ్యంగా ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీ తక్కువుగా ఉన్నస్మార్ట్‌ఫోన్‌లలో ఈ సమస్య ప్రధాన అవరోథంగా ఉంది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో స్టోరేజ్ స్పేస్ సమస్యలను అధిగమించేందుకు పలు ట్రిక్స్‌ను ఫాలో అవ్వండి. ఫోన్‌లోని యాప్స్‌ను ఎస్డీ కార్డ్‌లోకి మూవ్ చేయటం ద్వారా ఫోన్ ఇంటర్నల్ మెమరీ ఆదా చేసుకోవచ్చు. ఇలా చేయటానికి సెట్టింగ్స్‌.. యాప్స్‌.. డౌన్‌లోడ్ యాప్స్‌లోకి వెళ్లి ఒక్కో యాప్‌ను సెలక్ట్ చేసుకుని మూవ్ టు ఎస్‌డీ కార్డ్ పై టైప్ చేయండి. ఫోన్‌లో ఉప‌యోగంలేని యాప్స్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయటం ద్వారా ఇంటర్నల్ మెమరీ సేవ్‌ అవుతుంది.

 

అలాగే ఫోన్‌లోని డౌన్‌లోడ్స్ ఫోల్డర్‌ను ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవటం వ్వారా ఇంటర్నల్ స్పేస్‌ను ఆదా చేసుకోవచ్చు. మ‌రియు ఫోన్ యాప్స్‌కు సంబంధించి క్యాచీని తొలగించటం ద్వారా ఫోన్ ఇంటర్నల్ స్పేస్ ఆదా అవుతుంది. క్లీన్ మాస్టర్, క్యాచీ క్లీనర్ వంటి యాప్స్ ఈ ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయగలవు. ఫోన్‌లోని డౌన్‌లోడ్స్ ఫోల్డర్‌ను ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవటం వ్వారా ఇంటర్నల్ స్పేస్‌ను ఆదా చేసుకోవచ్చు. 


 
  
   
  
 
  

మరింత సమాచారం తెలుసుకోండి: