ప్రస్తుతం ఎవరి చేతిలో చూసినా స్మార్ట్‌పోన్‌లు దర్శనమిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే స్మార్ట్‌ఫోన్ ప్రతి ఇంటిలో కనీసం ఒక్కరి దగ్గరైనా ఉంటోంది. అదృష్టమో దురదృష్టమో కాని స్మార్ట్‌ఫోన్ నేడు మానవ దైనందిన జీవితంలో ఒక భాగమైంది. మెలకువగా ఉంటే చేతిలో, నిద్రపోతే పక్కలో ఫోన్‌ ఉండాల్సిందే. ఇలా రోజంతా ఫోన్ వాడ‌డం వ‌ల్ల కొన్ని గంటల్లోనూ ఫోన్ చార్జింగ్ సున్నా స్థాయికి చేరుకుంటోంది. మళ్లీ స్మార్ట్‌ఫోన్‌లు పూర్తిగా చార్జ్ అవ్వాలంటే గంటల తరబడి సమయాన్ని తీసుకుంటాయి. 

 

అయితే కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అయితే నిమిషాల్లో ఫుల్ అవుతుంది. ఫోన్‌లను చార్జ్ చేసేందుకు కంపెనీ చార్జర్‌లను మాత్రమే ఉపయోగించండి. ఫోన్‌తో పాటుగా వచ్చే కంపెనీ  చార్జర్‌ను ఉపయోగించటం ద్వారా మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ వేగవంతంగా చార్జ్ అవుతంది. ల్యాప్‌టాప్‌లతో పోలిస్తే డెస్క్‌టాప్‌లు ఎక్కువ శక్తిని వినియోగించుకుంటాయి. కాబట్టి మీ స్మార్ట్‌ఫోన్‌ను డెస్క్‌టాప్ యూఎస్బీ పోర్ట్ ద్వారా చార్జ్ చేయటం ద్వారా మరింత ఫాస్ట్‌గా ఛార్జింగ్ ఎక్కుతుంది.

 

అదేవిధంగా, మీ స్మార్ట్‌ఫోన్‌లను వేగవంతంగా చార్జ్ చేసేందుకు డాకింగ్ స్టేషన్ మరో బెస్ట్ ఆప్షన్. ఫోన్ చార్జ్ అవుతోన్న సమయంలో వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ వంటి ఫీచర్లను టర్నాఫ్ చేయటం మంచిది. దీంతో ఫోన్ వేగవంతంగా చార్జ్ అవుతుంది. మ‌రియు యూఎస్బీ 3.0 పోర్ట్, స్టాండర్డ్ ఏసీ వాల్ చార్జర్‌లతో పోలిస్తే శక్తిని మరింత వేగవంతంగా సప్లై చేస్తంది. యూఎస్బీ 3.0 పోర్ట్ గరిష్ట వేగం 900ఎమ్ఏ. కాబట్టి, యూఎస్బీ 3.0 పోర్ట్ ద్వారా మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ‌ని వేగవంతంగా చార్జ్ చేసుకోవచ్చు.

 
   

మరింత సమాచారం తెలుసుకోండి: