జీమెయిల్ నేడు ఎక్కువ మంది వినియోగించే ఆన్ లైన్ సమాచార వారధి. ఎన్నో రకాల సేవలకు ఈ మెయిల్ ఎంతో అవసరం. ఎన్నింటికో ఈ మెయిల్ ఐడీ అన్నది డిజిటల్ చిరునామా. సెక్యూరిటీ విషయంలో జీమెయిల్ యూజర్లను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నట్లు గూగుల్ చెబుతోంది. అందుకు భద్రత కోసం జీమెయిల్ యూజర్లు టూ స్టెప్ వెరిఫికేషన్ చేసుకోవటం మంచిది. గూగుల్ అకౌంట్‌ను ఓపెన్ చేసే ప్రయత్నంలో యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసిన ప్రతిసారి మీ మొబైల్ ఫోన్‌కు 6 అంకెల వెరిఫికేషన్ కోడ్ నెంబరుతో మెసేజ్ వస్తుంది. అప్పుడు ఆ కోడర్ నెంబరు ఇతరులకు తెలియదు కాబట్టి మీ జీమెయిల్ అకౌంట్ ఇతరులు ఎవరూ హ్యాకింగ్ చేయబలరు.

 

అందుకు ముందుగా మీ జీమెయిల్ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వండి. కుడివైపు టాప్ మెనూ బార్‌లో కనిపించే అకౌంట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఆ త‌ర్వాత‌ కనిపించే పేజీలో పైన కనిపించే సెక్యూరిటీ ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు కనిపించే పాస్‌వర్డ్ డైలాగ్ బాక్స్‌లో టూ స్టెప్ వెరిఫికేషన్ ఆప్షన్ పక్కన కనిపించే `సెట్ అప్‌` ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఆ తరువాత కనిపించే పేజీలో స్టార్ట్ సెట్ అప్‌ బటన్ పై క్లిక్ చేసినట్లయితే టూ స్టెప్ వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. టూ స్టెప్ వెరిఫికేషన్ కోడ్‌ను యాక్టివేట్ చేసుకునే క్రమంలో ప్రతిసారి వెరిఫికేషన్ కోడ్ అందవల్సిన ఫోన్ నెంబర్‌ను మీరు ఎంటర్ చేయవవల్సి ఉంటుంది. 

 

మీరు ఎంపిక చేసుకునే ఆప్షన్‌ను బట్టి ఆరు అంకెల వెరిఫికేషన్ కోడ్ ఎస్ఎంఎస్ లేదా వాయిస్ కాల్ రూపంలో మీ ఫోన్‌కు అందుతుంది. తక్షణమే, మీరు ఎంటర్ చేసిన ఫోన్ నెంబర్‌కు ఎస్ఎంఎస్ లేదా వాయిస్ కాల్ రూపంలో ఆరు అంకెలతో కూడిన వెరిఫికేషన్ కోడ్ అందుతుంది. ఆ కోడ్‌ను మీరు ఎంగ‌ర్ వెరిఫికేష‌న్ కోడ్ ఆప్షన్ ప్రక్కన కనిపించే ఖాళీ బాక్సులో ఎంటర్ చేయవల్సి ఉంటుంది. తరువాత ప్రత్యక్షమయ్యే ట్ర‌స్ట్ థిస్ కంప్యూట‌ర్‌ బాక్సులో నెక్ట్స్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు గూగుల్ టూ స్టెప్ వెరిఫికేషన్‌ను యాక్టివేట్ చేసేందుకు క‌న్‌ఫ్రిమ్‌ ఆప్షన్ పై క్లిక్ చేయవల్సి ఉంటుంది. అలా చేసినట్లయితే మీ గూగుల్ అకౌంట్‌కు గూగుల్ టూ స్టెప్ వెరిఫికేషన్ ప్రక్రియ అమలైనట్లే. సో.. ఖ‌చ్చితంగా ఫాలో అవ్వండి.

 
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: