రిలయెన్స్ జియో... ఈ పేరు వింటే 4జీ నెట్‌వర్క్‌లో సృష్టించిన సంచలనాలే గుర్తొస్తాయి. ఇప్పటికీ 4జీ నెట్‌వర్క్‌లో జియోదే పైచేయి. రిలయన్స్ జియో రాకతో దేశీయ టెలికం రంగంలో మొబైల్ డేటా విప్లవానికి తెర లేసింది. తక్కువ ధరకే ఎక్కువ డేటా ఇవ్వడంతో ఇతర నెట్ వర్క్ యూజర్లంతా జియో బాటపట్టారు. చౌక ధరల్లో డేటా అఫర్లు అందిస్తూ అనతి కాలంలోనే కోట్లాది మంది వినియోగదారులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక రిలయన్స్ నుంచి పుట్టిన జియో అంటే హిందీలో అర్థం ఏంటో తెలుసా జీవించు అని.

 

ఇక మీరు జియో యూజ‌ర్ అయితే ఈ విష‌యానికి ఖ‌చ్చితంగా తెలుసుకోండి. 4జీ డౌన్‌లోడ్ స్పీడ్ చార్ట్‌లో రిలయెన్స్ జియో టాప్‌లో నిలిచింది. అంటే 4జీ నెట్‌వర్క్ ద్వారా ఫైల్స్ డౌన్‌లోడ్ చేయడంలో రిలయెన్స్ జియో మిగతా నెట్వర్క్‌ల కన్నా చాలా స్పీడ్‌లో ఉందని టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా తాజా లెక్కలు వెల్ల‌డించారు. జ‌న‌వ‌రి 2020 వెల్ల‌డించిన లెక్క‌ల ప్ర‌కారం రిలయెన్స్ జియో డౌన్‌లోడ్ స్పీడ్ 20.9 మెగాబిట్ పర్ సెకండ్-mbps స్పీడ్ ఉండటం విశేషం. అయితే 2019 నవంబర్‌లో ఈ స్పీడ్ 27.2 ఎంబీపీఎస్ ఉంది. 

 

కాని, స్పీడ్ కాస్త తగ్గినా మిగతా నెట్వర్క్‌లకు అందనంత దూరంలో ఉంది రిలయెన్స్ జియో. ఇక జియోతో పోటా పోటి ప‌డుతున్న ఎయిర్‌టెల్ 4జీ డౌన్‌లోడ్ స్పీడ్ 7.9 ఎంబీపీఎస్ కాగా, ఆ తర్వాతి స్థానాల్లో వొడాఫోన్ 7.6 ఎంబీపీఎస్, ఐడియా 6.5 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఉన్నాయి. మ‌రియు ఇక 4జీ అప్‌లోడ్ స్పీడ్‌లో వొడాఫోన్ 6 ఎంబీపీఎస్‌తో టాప్‌లో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో ఐడియా 5.6 ఎంబీపీఎస్, రిలయెన్స్ జియో 4.6 ఎంబీపీఎస్, ఎయిర్‌టెల్ 3.8 ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో ఉన్నాయి.


 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: