ప్రపంచంలో రోజుకో అద్భుతం జరుగుతుంది.. ఒక వైపు వినాశకాలు, మరో వైపు ఊహించలేని విజయాలు. ఈ రెండు మనవుని చెంతనే ఉన్నాయి. మరణాన్ని జయించలేని మనిషి దానికోసం తీవ్ర కృషిచేస్తున్నాడన్న విషయం తెలిసిందే.. అయితే చావును జయిస్తాడో లేదో తెలియదు గాని చనిపోయిన మనుషుల జ్ఞాపకాలను మాత్రం తన మనసులో సజీవంగా బ్రతికించుకుంటున్నాడు.. ఇందుకు ఈ కాలంలో ఎంతో టెక్నాలజీ అందుబాటులో ఉంది..

 

 

అది సరే ఆ జ్ఞాపకాలను ఎంత కాలం గుర్తుంచుకుంటాడు. తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే వారు దూరమైతే, అందులో కన్న బిడ్డలు అకాలమరణం చెందితే, వారు గుర్తొచ్చినప్పుడల్లా ఒక్క సారి కనిపిస్తే బాగుండును, ఒక్క సారి మాట్లాడితే బాగుండును అనిపిస్తుంది. మరి ఇది సాధ్యమా అంటే, అసాధ్యం అని చెప్పవచ్చూ, ఎందుకంటే అసలు మరణించిన మనిషి ఆత్మ ఎక్కడికి వెళ్లుతుందో ఇంత వరకు ఎవరు చెప్పలేకపోయారు. ఇక దేహం మట్టిలో కలిసిపోతుంది. ఈ దశలో ఆత్మీయులతో మాట్లాడటం అనేది ఓ కల అని అనుకోవచ్చూ, కానీ ఈ కలను నిజం చేస్తూ, ‘వర్చువల్‌ రియాలిటీ’ టెక్నాలజీని తయారు చేసారు..

 

 

ఇదేదో సైన్స్‌ సినిమా, లేక ఓ కథనో కాదు. అసాధ్యాలను సుసాధ్యం చేసిన టెక్నాలజీ అద్భుతం. అమ్మ కలలకే పరిమితమైపోయిన ఓ పాప ‘వర్చువల్‌’గా కంటి ముందు నిలిపింది. ‘మీటింగ్‌ యు’ పేరుతో కొరియాకు చెందిన ఒక టీవీ చానల్‌ ప్రసారం చేసిన ఈ డాక్యుమెంటరీ ప్రపంచం మొత్తం సంచలనం సృష్టించింది. ప్రపంచాన్ని కంటతడి పెట్టేలా చేసింది. కొరియా దేశానికి చెందిన జాంగ్‌ జి సింగ్‌ అనే మహిళకు నేయోన్‌ అనే ఏడు సంవత్సరాల కూతురు ఉండేది. అయితే ఆ పాప 2016లో ఓ అంతుచిక్కని వ్యాధితో మరణించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ తల్లి తన కూతురు జ్ఞాపకాలతోనే బతుకుతూ ఉంది..

 

 

ఈ దశలో ఆ దేశానికే చెందిన ఎంబీసీ అనే చానల్‌ ‘మీటింగ్‌యు’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జాంగ్‌ జి సంగ్‌ తలకు వర్చువల్‌ రియాలిటీ హెడ్‌ సెట్‌ అమర్చి, కూతురు డిజిటల్‌ అవతార్‌ స్పర్శ తెలిసేలా ఆమె చేతులకు టచ్‌ సెన్సిటివ్‌ గ్లవ్స్‌ అమర్చారు. ఆ హెడ్‌సెట్‌ తగిలించుకునే సంగ్‌ కళ్లముందు ఒక డిజిటల్‌ ప్రత్యక్షమైంది. అక్కడ ఊదా రంగు గౌను ధరించి మెరిసే కళ్లతో తననే చూస్తూన తన కుమార్తె కనపడింది అమెకు. అంతే అప్పటివరకు మౌనంగా తనలో దాగిన వేదన కన్నీటి రూపంలో బయటకు రాగా వారిని చూసిన ప్రేమ కూడా పేదరాలైపోయింది. ఆ చిన్నారి నేయోన్‌ ముద్దు ముద్దు మాటలతో తల్లితో మాట్లాడుతుండగా, అక్కడ జరుగుతున్న సంబాషణలకు, హృదయం ద్రవించని వారు ఉండరు..

 

 

డిజిటల్‌ అవతార్‌, ఎప్పుడో మరణించిన కుమార్తెను కళ్ల ముందు కనిపించేలా చేస్తుంటే సంగ్‌ తాకేందుకు ప్రయత్నించింది. చివరికి కన్నీటితో ఆ చిన్నారి చేతిని పట్టుకుంది. చూశావా అమ్మా.. నాకిక్కడ ఏ బాధా లేదు.. అని చిన్నారి చెప్పగా,  తన పాప పుట్టిన రోజు వేడుకలు సంగ్‌ జరిపింది. ఇద్దరూ కలిసి ఆడుకున్నారు. చివరకు తాను అలసిపోయానంటూ అమ్మకు గుడ్‌బై చెప్పి పడుకుంది. తర్వాత ఆ పాప ఓ అందమైన సీతాకొక చిలుకగా మారిపోయింది.

 

 

దాదాపు 8 నిమిషాల పాటు జరిగిన ఈ షోను అక్కడే ఉన్న సంగ్‌ భర్త, ఇద్దరు పిల్లలు చూసి, వారు కూడా తీవ్ర భావోద్వేగానికి గురై, కంటతడి  పెట్టారు. ఇక ఆప్తులను దూరం చేసుకున్న వారు ఎవరైనా ఈ టెక్నాలజీ ద్వారా కలిసే అవకాశం ఉంది. ఇకపోతే ఇంత చక్కగా కూతురి వర్చువల్‌ డిజిటల్‌ గ్రాఫిక్‌ బొమ్మను కొరియాకు చెందిన మున్వా బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌ తయారు చేసింది. పాప రూపం, హైట్‌, బాడీ, మాట అన్ని చనిపోయిన పాపలాగే ఉండేలా జాగ్రత్తలు తీసుకుంది. నిజంగా ఇదో అద్భుతమని చెప్పవచ్చూ.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: