టెక్నాలజీని వాడుకోవడం ద్వారా పని భారాల్ని తగ్గించుకోవచ్చు. ఇది అందరికీ తెలిసిందే. కానీ ఆచరణలో చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే అటువంటి టెక్నాలజీ ఎలా వాడుకోవాలో తెలియదు. ముఖ్యంగా డెస్క్‌టాప్ కంప్యూటింగ్‌లో భాగంగా మౌస్ ప్రధాన పాత్ర‌ పోషిస్తుంది. మౌస్ సాయంతో కీబోర్డ్‌తో పనిలేకుండా అనేక కమాండ్‌లను సెకన్ల వ్యవధిలో నిర్వహించుకోవచ్చు. ఈ క్ర‌మంలోనే చాలా మందికి మౌస్ సాయంతోనే కంప్యూటర్‌ను ఆపరేట్ చేయటం తెలుసు. 

 

అయితే చాలా మంది ఈ మౌస్ ట్రిక్స్ తెలియ‌క‌పోవ‌చ్చు. అలాంటి వారికోస‌మే ఈ మౌస్ టిప్స్ అంట్ ట్రిక్స్‌. కీబోర్డ్‌లోని షిప్ట్ ‘కీ'ని హోల్డ్ చేసి ఉంచి ఫైల్ లేదా ఫోల్డర్ పై రైట్ క్లిక్ చేసినట్లయితే విస్తరించిన కాంటెక్ట్స్‌ మెనూను మీరు చూడొచ్చు. అలాగే ఓపెన్ చేసి ఉన్న నోట్‌ప్యాడ్ లేదా వర్డ్ డాక్యుమెంట్‌ను డిలీట్ చేయాలంటే విండో బార్ ఎడమ వైపు పై భాగంలో డబల్ క్లిక్ ఇచ్చినట్లయితే విండోస్ క్లోస్ అవుతుంది. మినిమైజ్ లైదా మ్యాగ్జిమైజ్ చేయాలంటే విండో బార్ మధ్య భాగంగలో డబల్ క్లిక్ ఇస్తే చాలు.

 

మ‌రియు ఏదైనా లింక్‌ను కొత్త ట్యాబ్‌లో ఓపెన్ చేయాలంటే కీబోర్డ్‌లోని కంట్రోల్ ‘కీ'ని హోల్డ్ చేసి ఉంచి లింక్ పై రైట్ క్లిక్ చేసినట్లయితే లింక్ కొత్త ట్యాబ్‌లో ఓపెన్ అవుతుంది. ఏదైనా ఫోటోను జూమ్ చేయాలంటే, కీబోర్డ్‌లోని కంట్రోల్ ‘కీ'ని హోల్డ్ చేసి మౌస్ మధ్యలోని స్క్రోలర్‌ను ఉపయోగించటం ద్వారా ఫోటో జూమ్ అవుతుంది. కీబోర్డ్‌లోని షిప్ట్ ‘కీ'ని హోల్డ్ చేసి ఉంచి మౌస్‌తో డాక్యుమెంట్ ముందు, చివరా రైట్ క్లిక్ చేయటం ద్వారా డాక్యుమెంట్‌లోని టెక్స్ట్ మొత్తం సెలక్ట్ అవుతుంది.

 
 
  

మరింత సమాచారం తెలుసుకోండి: