ఇటీవ‌ల కాలంలో ఎక్కడ చూసినా మొబైల్‌ ఫోన్లే క‌నిపిస్తున్నాయి. క‌నీసం ఇంటికి ఒక స్మార్ట్‌ఫోన్ అయినా ఉంటుంది. సమాచారమైనా, చేస్తున్న ఉద్యోగం, వ్యాపారం, ఏ పనైనా కావచ్చు. ఫోను లేకుండా రోజు గడవడం కష్టమే. రోజురోజుకు మొబైల్‌ ఫోన్లు అందులోనూ స్మార్ట్‌ఫోన్ల సంఖ్య పెరిగిపోతుంది. గ్రామీణ ప్రాంతాలలో వీటి వాడకం ఇటీవల ఎక్కువగా కనబడుతుంది. ఇక స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేశాక ముందుగా ప్లే స్టోర్‌లోకి వెళ్లి యాప్స్ డౌన్‌లోడ్ చేసుకుంటుంటారు. అయితే పొర‌పాటును ప్ర‌మాద‌క‌ర‌మైన యాప్స్ డౌన్‌లోడ్ చేసుకుంటే మాత్రం అనేక ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంది. 

 

ఇక తాజాగా ప్రముఖ మెసేజింగ్ యాప్ టోటోక్ ను గూగుల్ ప్లేస్టోర్ రెండోసారి తొలగించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం ఈ యాప్ ద్వారా వినియోగదారులపై నిఘా పెడుతోందని ప్లేస్టోర్ తెలిపింది. దీంతో ఈ యాప్ ను ఆపిల్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్ నుంచి డిసెంబర్‌లో తొలగించారు. కొన్ని నెలల క్రితం ప్రారంభించిన టోటోక్ మిడిల్ ఈస్ట్, యూరప్, ఆసియా, ఆఫ్రికా మరియు ఉత్తర అమెరికా అంతటా పెద్ద ప్రజాదరణ పొందింది. లక్షలాది డౌన్‌లోడ్‌లతో, టోటాక్ గత వారం యుఎస్‌లో అత్యధికంగా డౌన్‌లోడ్ చేసిన సోషల్ యాప్‌లలో ఒకటిగా నిలిచింది. 

 

అయితే టోటోక్‌ను వారి ఫోన్‌లలో ఇన్‌స్టాల్ చేసే వారి ప్రతి సంభాషణ, కదలిక, అపాయింట్‌మెంట్, సౌండ్ మరియు ఇమేజ్‌ని ట్రాక్ చేయడానికి యూఏఈ ఉపయోగించినట్లు ఆరోపణలు వచ్చాయని 9to5Google నివేదించింది.  టోటోక్ యాప్ ను బ్రీజ్ హోల్డింగ్ అనే సంస్థ రూపొందించింది. ఇది అబుదాబికి చెందిన సైబర్ ఇంటెలిజెన్స్ మరియు హ్యాకింగ్ సంస్థ డార్క్ మాటర్ కు అనుబంధంగా ఉందని దర్యాప్తులో తేలింది. దీంతో మొదటిసారి దీన్ని ప్లేస్టోర్ నుంచి తొలగించాక ఎలా వచ్చిందో తెలీదు కానీ మళ్లీ ఈ యాప్ ప్లేస్టోర్ కి వచ్చేసింది. అయితే దీన్ని గుర్తించిన గూగుల్ మళ్లీ ఈ యాప్‌ను తొలగించింది. సో.. ఈ యాప్ మీ ఫోన్‌లో ఉంటే వెంట‌నే తొల‌గించండి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: