స్మార్ట్‌ఫోన్ల ధరలు తగ్గడం, డేటా కోసం పెట్టే ఖర్చు తక్కువగా ఉండటం, సామాజిక మాధ్యమాలపై వెచ్చించే సమయం ఎక్కువ కావడం రోజువారీ వాట్సాప్‌ వినియోగం పెరిగేందుకు కారణాలు అన‌డంతో ఏ మాత్రం సందేహం లేదు. సమాచారం సులువుగా ఇచ్చిపుచ్చుకునేందుకు ఓ మార్గంగా మొదలైన ఈ టెక్‌ వేదిక.. ఇప్పుడు అనేక విధాలుగా  ఉప‌యోగ‌ప‌డుతుంది. మెసేజులు పంపడానికి, వాయిస్, వీడియో కాల్స్ చేయడానికి, ఫోటోలు, డాక్యుమెంట్లు షేర్ చేసుకోవడానికి ఈ యాప్ ను విపరీతంగా వాడుతున్నారు. అయితే ఒకళ్లకు పంపాల్సిన మెసేజ్​ ఇంకొకళ్లకు పొర‌పాటున పంపిస్తుంటారు.

 

అప్పుడు ఏం చేస్తారు..? ‘డిలీట్​ ఫర్​ ఎవ్రీ వన్​’ అనే ఆప్షన్​ ఉందిగా డిలీట్ చేస్తే స‌రిపోతుంది అనుకుంటారు. కానీ.. ఇక్క‌డ అస‌లు విష‌యం ఉంది. అన్ని సందర్భాల్లోనూ ఆ మెసేజ్​ డిలీట్​ అయిపోతుందనుకుంటే మీరు ప‌ప్పులో కాలేసిన‌ట్టే. కొన్ని సందర్భాల్లో ఆ ఆప్షన్​ ఫెయిలయ్యే చాన్స్ ఉంది. మ‌రి ఆ సంద‌ర్భాలు ఏంటో చూడండి. మనం మెసేజ్​ డిలీట్​ చేసినప్పుడు ఒక్కోసారి అది ఫెయిల్​ అయ్యే చాన్స్​ ఉంది. కానీ, మనకు నోటిఫికేషన్​ కూడా రాదు. ఇలాంటి సందర్భాల్లో అవతలి వ్యక్తి మనం పంపిన మెసేజ్​ను చూసే చాన్సెస్​ చాలా ఎక్కువ. పంపిన మెసేజ్​ను డిలీట్​ చేయడానికి ఉండే టైం గంటా 8 నిమిషాల 16 సెకన్లు. ఆ లోపలే మెసేజ్​ను డిలీట్​ చేసేయాలి.

 

డిలీట్​ ఆప్షన్​ను వాడుకోవాలంటే మీతోపాటు అవతలి వాళ్ల వాట్సాప్​ లేటెస్ట్​ వెర్షన్​ అయి ఉండాలి. ఆండ్రాయిడ్​, ఐవోఎస్​లైనా పంపేవాళ్లది, ఆ మెసేజ్​ను రిసీవ్​ చేసుకున్న వాళ్ల వాట్సాప్​ లేటెస్ట్​ వెర్షన్​లో ఉండాలి. లేదంటే మనం డిలీట్​ చేసినా.. అవ‌త‌లి వారి ఫోన్ డిలీట్ అవ్వ‌దు. అంతేకాకుండా పంపిన మెసేజ్​ను డిలీట్​ చేయాలనుకున్నలోపే వాళ్లు దాన్ని చూసే అవకాశం ఉంటుంది. దాంతో మ‌నం మెసేజ్ డిలీట్ చేసినా ప్ర‌యోజ‌నం ఉండ‌దు. అలాగే ఐఫోన్​ వాడేవాళ్ల వాట్సాప్​కు మెసేజ్​లుగానీ, ఫొటోలు గానీ పంపితే, ఆ ఫొటోలు వాళ్లవాళ్ల ఫోన్లలో సేవ్​ అయ్యే చాన్స్​ ఉంటుంది. దీంతో మ‌న మెసేజ్‌లు డిలీట్ చేసినా వాళ్ల ఫోన్‌లో అలాగే ఉంటుంది.


 

మరింత సమాచారం తెలుసుకోండి: