ఆన్‌లైన్‌ వేదికగా ఇప్ప‌టికే అనేక ర‌కాలుగా కొంద‌రు  కేటుగాళ్లు మోసాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. రుణాలు, వ్యాపారాలు, గిఫ్టుల పేరుతో ఎరవేస్తూ అమాయకులను నిలువునా ముంచేస్తున్నాయి. సులువుగా డబ్బులు సంపాదించాలని భావించి ఆన్‌లైన్‌ మోసాలకు తెర లేపుతారు. మారిన టెక్నాలజీ కొత్త పొంతలు తొక్కుతోంది. ఈ క్రమంలోనే ఆన్‌లైన్‌ మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. సైబర్‌ నేరాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. లాభాల ఆశ చూపి లక్షల రూపాయలు దండుకుంటున్నారు. దీనికి కారణం.. సోషల్ మీడియా ద్వారా మన సమాచారాన్ని మనమే మోసగాళ్లకు అందిస్తున్నాం.  

 

వీటిపట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెబుతున్నా... రోజుకొక మోసం బయటపడుతూనే ఉంది. మరి అలాంటి ఆన్‌లైన్ మోసాల నుంచి తప్పించుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పాస్‌వర్డ్ మేనేజర్ ఉపయోగించండి. పాస్‌వర్డ్ మేనేజర్‌తో మీరు స్ట్రాంగ్ పాస్‌వర్డ్స్ క్రియేట్ చేయడంతో పాటు వాటిని జాగ్రత్తగా స్టోర్ చేసుకోవచ్చు. మీ ఇమెయిల్ ఐడీకి రికవరీ మొబైల్ నెంబర్ లేదా ఇమెయిల్ ఐడీ తప్పనిసరిగా ఉండాలి. అవి మారితే వివరాలు అప్‌డేట్ చేయాలి. 

 

మీ ఇమెయిల్‌ని ఎవరైనా యాక్సెస్ చేస్తే మీ రికవరీ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్‌కు అలర్ట్ వస్తుంది. అలాగే మీకు అవసరం లేని యాప్స్, బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్స్ తొలగించాలి. మీకు తెలియని యాప్స్ డౌన్‌లోడ్ చేయొద్దు. మీ పాస్‌వర్డ్స్‌ వేరేవాళ్ల చేతుల్లోకి వెళ్లాయన్న అనుమానం ఉంటే గూగుల్ సెక్యూరిటీ చెకప్ చేయొచ్చు. దీని ద్వారా రిపీట్ పాస్‌వర్డ్స్, సెక్యూరిటీ లోపాలు తెలుసుకోవచ్చు. మీ ఓఎస్, యాప్స్, బ్రౌజర్ లాంటివి ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలి. లేకపోతే వైరస్ ఎటాక్స్ తప్పవు. సో.. బీకేర్‌ఫుల్‌..!

మరింత సమాచారం తెలుసుకోండి: