వాట్సాప్‌.. పెద్ద‌గా ప‌రిచ‌డం అవ‌స‌రం లేని పేరు. మెసేజులు పంపడానికి, వాయిస్, వీడియో కాల్స్ చేయడానికి, ఫోటోలు, డాక్యుమెంట్లు షేర్ చేసుకోవడానికి ఈ యాప్ ను విపరీతంగా వాడుతున్నారు. ఇన్‌స్టెంట్ మెసేజింగ్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్‌ను సొంతం చేసుకున్న వాట్సాప్ ఎప్ప‌టిక‌ప్పుడు యూజ‌ర్ల‌ను అక‌ర్షించేందుకు కొత్త కొత్త ఫీచ‌ర్ల‌ను ప్ర‌వేశ‌పెడుతుంటుంది. అయితే సాధార‌ణంగా చాలా మంది ఇత‌రుల వాట్సాప్‌ను చెక్ చేయ‌డానికి ఇష్ట‌ప‌డుతుంటారు.

 

అయితే ఇలాంటి వారికి చెక్ పెట్టాలంటే ముందుగా మ‌నం కొన్ని సెట్టింగ్స్‌ను మార్చుకోవాలి. వాట్సప్ ఛాటింగ్, మీడియా, ఇతర సమాచారం... ఇలా ప్రతీ దాంట్లో సెట్టింగ్స్ ఉంటాయి. ఆ ప్రైవసీ సెట్టింగ్స్ మార్చుకొని మీ వాట్సప్‌ని సేఫ్‌గా మార్చుకోవచ్చు. గూగుల్‌లో ఉన్నట్టుగానే వాట్సప్‌లో టూ స్టెప్ వెరిఫికేషన్ ఉంటుంది. 6 అంకెల పిన్ ఎంటర్ చేసి టూ స్టెప్ వెరిఫికేషన్ ఎనేబుల్ చేయాలి. మీరు ఎప్పుడైనా వాట్సప్ రీ ఇన్‌స్టాల్ చేస్తే పిన్ తప్పనిసరిగా ఎంటర్ చేయాలి. దీని ద్వారా ఎవరైనా మీ నెంబర్‌తో వాట్సప్ ఇన్‌స్టాల్ చేయాలన్నా సాధ్యం కాదు. 

 

అలాగే వాట్సప్‌లో టచ్ ఐడీ లేదా ఫేస్ ఐడీ లాక్ ఉంటుంది. మీ వాట్సప్‌ని లాక్ చేయడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. వాట్సప్ సెట్టింగ్స్‌లో అకౌంట్‌లో ప్రైవసీలో ఫింగర్‌ప్రింట్ లాక్ ఉంటుంది. ఈ ఫీచర్ ఎనేబుల్ చేస్తే మీరు వాట్సప్ ఓపెన్ చేయాలంటే ఫింగర్‌ప్రింట్ తప్పనిసరి. . మీ స్టేటస్, ప్రొఫైల్ ఫోటో లాంటివి ఎవరు చూడాలో మీరే సెట్టింగ్స్ చేయొచ్చు. సెట్టింగ్స్‌లో అకౌంట్‌లోకి వెళ్లి ప్రైవసీ క్లిక్ చేసి సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. అందులో మీకు లాస్ట్ సీన్, ప్రొఫైల్ ఫోటో, గ్రూప్స్, స్టేటస్ లాంటి ఆప్షన్స్ ఉంటాయి. వాటిలో సెట్టింగ్స్ చేయొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: