సమాచార సేకరణలో భాగంగా నేటి తరం యువత దాదాపు ఇంటర్నెట్ పైనే ఆధారపడుతోంది. ముఖ్యంగా ఇండియాలో ఇంట‌ర్నెట్ విప‌రీతంగా వినియోగిస్తున్నారు. హైస్పీడ్ ఇంటర్నెట్ పుణ్యమా అంటూ నిమిషాల వ్యవధిలోనే పేజీల కొద్ది డేటాను డౌన్‌లోడ్ చేసుకుగలుగుతున్నాం. అయితే.. పలు సందర్భాల్లో డౌన్‌లోడింగ్ వేగం మందగిస్తుంటుంది. ఎంపిక చేసుకున్న ఇంటర్నెట్ సర్వీస్ ప్యాక్‌లను బట్టి గరిష్ట అప్‌లోడ్, డౌన్‌లోడ్ వేగంతో కూడిన ఇంటర్నెట్ డేటాను అందించటం జరుగుతుంది.

 

అయితే ఒక్కోసారి ఇంట‌ర్నెట్ స్పీడ్ త‌గ్గిపోతూ ఉంటుంది. మరో ప్యాక్‌కు యాక్టివేట్ అయితే తప్ప మీకు ఇంటర్నెట్ స్పీడ్‌ను పెంచుకునే ఛాన్స్ లేదు అనుకుంటారు. కానీ ప‌రిష్కారం ఉంది. అవేంటో చూడండి. వైర్‌లెస్ ఇంటర్నెట్‌కు బదులుగా Ethernet cable ద్వారా ఇంటర్నెట్‌ను పొందటం వల్ల మీ డేటా స్పీడ్స్ మరింత పెరిగేలా చేస్తుంది. అలాగే వైర్‌లెస్ ఇంటర్నెట్ లోకేషన్‌ను మార్చటం ద్వారా మీ డేటా స్పీడ్‌ను పెంచుకునే అవకాశం ఉంది. మీ రూటర్‌, మోడెమ్‌, కంప్యూటర్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకోవటం ద్వారా ఇంటర్నెట్‌ వేగాన్ని పెంచుకోవచ్చు.

 

వైర్‌లెస్ రూటర్‌కు దగ్గరగా మీ డివైస్‌ను ఉంచే ప్రయత్నం చేసినట్లయితే సిగ్నల్ బలం మరింత పెరిగి డేటా వేగం మరింత పెరిగే అవకాశముంది. మోడెమ్ అలానే రౌటర్ ఫ్రీక్వెన్సీని రీబూట్ చేయటం ద్వారా ఇంటర్నెట్ స్పీడ్‌ను పెంచుకోవచ్చు. అలాగే మీ రూటర్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవటం వల్ల డేటా స్పీడ్స్‌ను మరింత పెంచుకోవచ్చు. పాత కాలం రూటర్స్‌ అవుట్‌డేటెడ్ కాంపోనెంట్స్‌ను కలిగి ఉండటం చేత ఇంటర్నెట్‌ను వేగవంతంగా యాక్సెస్ చేసుకోలేవు.

 
 
 
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: