చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ హానర్ తాజాగా మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. గతేడాది విడుదలై సూపర్ సక్సెస్ అయిన హానర్ 9ఎక్స్ స్మార్ట్ ఫోన్ కు ప్రో వెర్షన్ గా హానర్ 9ఎక్స్ ప్రో మార్కెట్లోకి రానుంది. సాంప్రదాయ గూగుల్ మొబైల్ సర్వీసెస్ కు బదులు హెచ్‌ఎంఎస్ తో వచ్చే మొట్టమొదటి ఫోన్ హానర్ 9ఎక్స్ ప్రో అని, ఇందులో హైసిలికాన్ కిరిన్ 810 ప్రాసెసర్ ను అందించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ను ఫిబ్రవరి 24వ తేదీన లాంచ్ చేయనున్నట్లు హానర్ వెల్ల‌డించింది. 

 

దీనికి సంబంధించిన లాంచ్ ఈవెంట్ స్పెయిన్‌లోని బార్సిలోనాలో రాత్రి 11:00 గంటలకు లో జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని హానర్ సోషల్ మీడియా చానెళ్లలో లైవ్ గా కూడా చూడవచ్చు. హానర్ 9ఎక్స్ ప్రో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ రెండు వేరియంట్లలో వస్తుంది. ఈ రెండు వేరియంట్లలో మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా 512 జీబీ వరకు మెమరీని పెంచుకోవచ్చు. అలాగే హానర్ 9 ఎక్స్ ప్రో గత ఏడాది చైనాలో లాంచ్ అయింది. హానర్ 9ఎక్స్ ప్రోలో 6.59 అంగుళాల ఫుల్ హెచ్ డీ + డిస్ ప్లేను అందించారు. హైసిలికాన్ కిరిన్ 810 చిప్‌సెట్ పై స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది. 

 

ఆండ్రాయిడ్ 9 Pie ఆధారిత ఈఎంయూఐ 9.1.1 ను ఇందులో అందించారు. బ్యాటరీ సామర్థ్యం 4,000 ఎంఏహెచ్ గా ఉంది. ఫాస్ట్ చార్జింగ్ కోసం యూఎస్‌బీ టైప్-సీ పోర్టును ఇందులో అందించారు. మ‌రియు  హానర్ 9ఎక్స్ ప్రోలో వెనకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ను అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ కాగా, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా, 8 మెగా పిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ సెన్సార్ ను కూడా అందించారు. ముందువైపు ఫోన్ 16 మెగాపిక్సెల్ పాప్-అప్ సెల్ఫీ కెమెరా ఇందులో ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: