ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ అనేది కామన్ అయిపోయింది. ప్రతి ఒక్కరి చేతిలో అది ఇమిడిపోయింది. అదిరే ఫీచర్లతో పాటు అద్భుతమైన కెమెరాతో కూడిన స్మార్ట్‌ఫోన్లు ఏమి ఉన్నాయోనని వెతికీ మరి కొంటుంటారు. ఫోన్ కొనేముందే కెమెరా ఎలా ఉంది? ఎన్ని మెగాపిక్సెల్ కెమెరా వాడుతున్నారు? ఫోన్‌లో ఎన్ని కెమెరాలున్నాయి? ఫోటోలు ఎలా వస్తాయి? ఇలాంటివన్నీ చూస్తుంటారు. సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టేందుకు ఆసక్తిని ప్రదర్శించే వారు కూడా మంచి కెమెరా ఫోన్ల వైపు చూపును మరల్చుతుంటారు. అయితే ఇటీవ‌ల వ‌చ్చిన బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్లు ఏమేమి ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

 

వివో జెడ్1 ప్రో లో 16 మెగా పిక్సెల్ + 8 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్ కెమెరా మ‌రియు 32 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. అలాగే 6.53 అంగుళాల ఐపీఎస్ ఎల్ సీడీ డిస్ ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ,  4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్, 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఉన్నాయి.  దీని ధ‌ర రూ.12,990. రెడ్ మీ నోట్ 8లో 48 మెగా పిక్సెల్ + 8 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్ కెమెరా మ‌రియు 13 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాను అమ‌ర్చారు. అలాగే 6.3 అంగుళాల ఐపీఎస్ ఎల్ సీడీ డిస్ ప్లే, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ,  జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. దీని ధ‌ర  రూ.10,499. 

 

రియల్ మీ 5 ప్రోలో 48 మెగా పిక్సెల్ + 8 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్ కెమెరా మ‌రియు 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా అమ‌ర్చారు. అలాగే  6.3 అంగుళాల ఐపీఎస్ ఎల్ సీడీ డిస్ ప్లే, 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్, 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఉన్నాయి. దీని ధ‌ర రూ.12,990. ఇక శాంసంగ్ గెలాక్సీ ఏ50లో 25 మెగా పిక్సెల్ + 5 మెగా పిక్సెల్ + 8 మెగా పిక్సెల్ కెమెరా మ‌రియు 25 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇందులో అమ‌ర్చారు. అలాగే  6.4 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ సూపర్ అమోఎల్ఈడీ డిస్ ప్లే, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. దీని ధ‌ర రూ.12,999.


 

 

  
  

మరింత సమాచారం తెలుసుకోండి: