దేశీయ టెలికం మార్కెట్లోకి సునామీలా దూసుకొచ్చి సరసమైన టారిఫ్‌ ప్లాన్లతో కేవలం మూడేండ్లలోనే ఎంతోమందికి చేరువవడంతోపాటు అతిపెద్ద నెట్‌వర్క్‌ ఆపరేటర్‌గా ఆవిర్భవించిన రిలయన్స్‌ జియో గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. చౌక ధరల్లో డేటా అఫర్లు అందిస్తూ అనతి కాలంలోనే కోట్లాది మంది వినియోగదారులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. రిలయన్స్ జియో రాకతో దేశీయ టెలికం రంగంలో మొబైల్ డేటా విప్లవానికి తెర లేసింది. తక్కువ ధరకే ఎక్కువ డేటా ఇవ్వడంతో ఇతర నెట్ వర్క్ యూజర్లంతా జియో బాటపట్టారు. 

 

ఇక అస‌లు విష‌యంలోకి వ‌స్తే.. మీరు రిలయెన్స్ జియో యూజరా? మీ స్మార్ట్‌ఫోన్‌లో రిలయెన్స్ జియో సిమ్ కార్డ్ ఉందా? అయితే జియో మీ కోసం మరో సరికొత్త దీర్ఘకాలిక ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకువ‌చ్చింది. రూ. 2121 పేరుతో సరికొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 336 రోజుల వ్యాలిడిటీ కలిగిన ఈ ప్లాన్‌లో జుకు 1.5 జీబీ హైస్పీడ్‌ డేటా లభిస్తుంది. అలాగే జియో నుంచి జియో, ల్యాండ్‌ లైన్‌కు అపరిమిత వాయిస్‌ కాల్స్‌ చేసుకోవచ్చు. 

 

జియోయేతర కాల్స్‌ మాట్లాడుకోవడానికి 12వేల నిమిషాలు అందిస్తున్నారు. 2121 ప్లాన్‌లో రోజూ 100 ఎస్ఎంఎస్ సందేశాలు ఉచితం. రూ. 2,121 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ జియోతోపాటు, గూగుల్ పే, పేటీఎమ్‌తో వంటి యాప్స్‌లోనూ తాజా ప్లాన్ అందుబాటులో ఉంది. న్యూ ఇయర్ సందర్భంగా జియో ప్రకటించిన 2020 ప్లాన్ కూడా ఇవే ప్రయోజనాలు కలిని ఉన్నప్పటికీ ఆ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులు ఉండేది. కానీ, ప్రస్తుతం 2020 ప్లాన్ అందుబాటులో లేదు. ఆ ఛాన్స్ మిస్సైన వారికి 2121 ప్లాన్ మంచి అవకాశం.


   
 

మరింత సమాచారం తెలుసుకోండి: