స్మార్ట‌ఫోన్ల వినియోగం పెరిగే కొద్ది వాట్సాప్ వినియోగం కూడా పెరుగుతూ వ‌స్తోంది. అలాగే స్మార్ట్‌ఫోన్‌ కొనే చాలామంది మొదట ఇన్‌స్టాల్‌ చేసే యాప్‌ వాట్సప్‌ అంటే అతిశయోక్తి కాదు.  మెసేజులు పంపడానికి, వాయిస్, వీడియో కాల్స్ చేయడానికి, ఫోటోలు, డాక్యుమెంట్లు షేర్ చేసుకోవడానికి ఈ యాప్ ను విపరీతంగా వాడుతున్నారు. ఇన్‌స్టెంట్ మెసేజింగ్ ప్రపంచంలోకి పెను ఉప్పెనలా దూసుకొచ్చిన వాట్సాప్‌ను రకరకాల కమ్యూనికేషన్ అవసరాల దృష్ట్యా ప్రతిరోజు కోట్ల‌లో యూజర్లు వినియోగిస్తున్నారు. వాట్సాప్ వినియోగించాలంటే ఖ‌చ్చితంగా స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాల్సిందే.

 

అయితే ఇంట‌ర్నెట్ లేక‌పోయినా.. వాట్సాప్ ఎలా వినియోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. గ‌తంలో షాంఘైలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ వరల్డ్ ప్రీమియర్‌‍లో భాగంగా చాట్‌సిమ్ వరల్డ్ అనే కంపెనీ `చాట్‌సిమ్‌` పేరుతో సరికొత్త సిమ్‌కార్డ్‌ను ఆవిష్కరించింది. ఈ చాట్‌సిమ్‌ను మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్సర్ట్ చేసుకున్నట్లయితే ఇన్‌స్టెంట్ మెసేజింగ్ అప్లికేషన్‌ల పై ఏ విధమైన చార్జ్ చెల్లించకుండా ఉపయోగించుకోవచ్చు. ఈ సిమ్‌‌లను చాట్‌సిమ్ వరల్డ్ తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో విక్రయిస్తోంది.

 

వాట్సాప్, ఫేస్‌బుక్ మెసెంజర్, వుయ్‌చాట్ తదితర ప్రముఖ ఇన్స్‌స్టెంట్ మెసేజింగ్ యాప్స్‌ను ఈ సిమ్‌కార్డ్ ద్వారా వాడుకోవచ్చు. చాటింగ్ మాత్రమే కాదు వాయిస్ కాల్స్ కూడా నిర్వహించుకోవచ్చు. వై-ఫై కనెక్టువిటీతో పనిలేకుండా ఈ చాట్‌సిమ్ పనిచేస్తుంది. చాట్‌సిమ్‌లోని సింగిల్ వాయిస్ కమ్యూనికేషన్ సిస్టం ద్వారా అన్ని ఇన్‌స్టెంట్ మెసేజింగ్ యాప్స్ ద్వారా వాయిస్ కాల్స్ నిర్వహించుకోవచ్చు. అయితే మొత్తం షిప్పింగ్ ఛార్జీలతో కలుపుకుని ఈ సిమ్ మీకు అందాలంటే దాదాపు రెండు వేల‌కు పైగా వెచ్చించాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: