ఇటీవ‌ల కాలంలో ప్ర‌తి ఒక్క‌రి చేతిలో స్మార్ట్‌ఫోన్ కామ‌న్ అయిపోయింది. నిద్ర లేచింది మొద‌లు.. రాత్రి ప‌డుకునే ముందు వ‌ర‌కు స్మార్ట్‌ఫోన్‌తో బిజిబిజిగా గ‌డుపుతుంటారు. అయితే ఆండ్రాయిడ్ యూజ‌ర్ల‌కు గుడ్ న్యూస్ అందించింది. గూగుల్ ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ కు చెందిన లేటెస్ట్ అప్ డేట్ ఆండ్రాయిడ్ 11 ఈసారి చాలా ముందుగానే వినియోగదారుల వద్దకు వచ్చే అవకాశం ఉంది. ఈసారి చాలా ముందుగానే దానికి సంబంధించిన ప్రివ్యూను విడుదల చేసింది. ఈ అప్ డేట్ ద్వారా అందించే కీలక ఫీచర్లను ముందుగానే తెలిపింది. డెవలపర్ల ఫోన్లకు ఈ ఫీచర్లు ఇప్పటికే చేరాయి. దీనికి సంబంధించిన ఫైనల్ వెర్షన్ ఈ సంవత్సరం అక్టోబర్ నుంచి వినియోగదారుల ఫోన్లను చేరే అవకాశం ఉంది.

 

ఆండ్రాయిడ్ 11 ఫీచర్ల గురించి చెప్పాలంటే.. ఇది ఫోల్డబుల్ ఫోన్లు, వివిధ రకాలైన స్క్రీన్ లకు సపోర్ట్ చేసేలా దీన్ని రూపొందిస్తున్నారు. కెమెరా సామర్థ్యాన్ని పెంచే సరికొత్త ఫీచర్లు, ప్రైవసీ సంబంధింత ఫీచర్లు, యాప్ ల పనితీరును మరింత మెరుగుపరిచే ఫీచర్లు, 5జీ సంబంధిత ఫీచర్లు వంటి మరెన్నో ఫీచర్లను ఆండ్రాయిడ్ 11లో అందించనున్నారు. అలాగే ఆండ్రాయిడ్ 11 ద్వారా గూగుల్ తన ఆపరేటింగ్ సిస్టం వినియోగదారులకు డార్క్ మోడ్ ను షెడ్యూల్ చేసే అవకాశం కూడా కల్పిస్తుంది. 

 

అంతేకాదు,  సమయాన్ని బట్టి ఫోన్ లో డార్క్ మోడ్ ఆటోమేటిక్ గా ఎనేబుల్ అయ్యేలా మీ ఫోన్ లో సెట్ చేసుకోవచ్చు. గ్లవ్స్ వేసుకున్నప్పటికీ టచ్ బాగా పనిచేసేలా ఆండ్రాయిడ్ లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టం 11లో మార్పులు చేయనుంది. ఆండ్రాయిడ్ 11 ద్వారా వినియోగదారులు తమకు వచ్చే స్పామ్ కాల్స్ ను సులభంగా మార్చ్ చేయవచ్చు. ఫోన్ డయలర్ యాప్ లోనే నేరుగా ఈ పనిచేసే అవకాశం ఉంటుంది. ఆండ్రాయిడ్ 11 ద్వారా మీకు ఫొటోలను ఏకంగా నోటిఫికేషన్ ప్యానెల్ నుంచే పంపేసే అవకాశం ఉంటుంది. 

 

అలాగే ఎప్పుడైనా ఫొటో తీసుకుందామని ఫ్రంట్ కెమెరా లేదా మామూలు కెమెరా ఓపెన్ చేసినప్పుడు అప్పుడే కాల్ వస్తే మనకు చాలా చిరాకు వస్తుంది. తాజా అప్ డేట్ లో దీన్ని కూడా గూగుల్ పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అంటే ఇకపై మీరు కెమెరా ఉపయోగించేటప్పుడు నోటిఫికేషన్లను ఆండ్రాయిడ్ తనంతట తానే మ్యూట్ చేస్తుంది. 

 

  

మరింత సమాచారం తెలుసుకోండి: