ప్రస్తుత ఆధునిక యుగంలో స్మార్ట్‌ ఫోన్‌ ప్రాధాన్యం పెరిగింది. వేల రూపాయలు వెచ్చించి కొన్నదైనా, లేటెస్ట్‌ ఫీచర్స్‌ ఉన్నదైనా, సరికొత్త యాంటీ వైరస్‌ ఇన్‌స్టాల్‌ చేసిందైనా, స్మార్ట్‌ఫోన్‌ కొంత కాలానికి వేగంలో నెమ్మదిస్తుంది. తరచూ ఫోన్‌ హ్యాంగ్‌ అవుతూ విసుగెత్తిస్తుంది. అవసరాలకు పనిచేయని వారు ఎలాగైతే అనవసరమని భావిస్తామో ..అవసరం లేని యాప్‌లూ ఫోన్‌కు భారమవుతాయి. అప్పుడప్పుడు చూసేవే అయినా అటువంటి యాప్‌లు ఫోన్‌లో అధిక శాతం మొమోరీని ఆక్రమిస్తాయి. దీంతో ఫోన్ స్టోరేజ్ ఎక్కువ అయిపోతోంది.

 

దీంతో ఫోన్ స్లో అవుతూ ఉంటుంది. అలాగే స్టోరేజ్ స్పేస్ నిండిపోయిన ప్రతిసారి ఫోన్‌లోని పనికిరాని డేటాను డిలీట్ చేయవల్సి ఉంటుంది. మ‌రి ఫోన్‌లో స్టోరేజ్ స్పేస్‌ను నిమిషాల్లో క్లియర్ చేయాలంటే ఇలా చేయండి. ఫోన్‌లోని ఫోటోలు, వీడియోలను గూగుల్ డ్రైవ్, మైక్రోసాఫ్ట్ వన్‌డ్రైవ్ వంటి క్లౌడ్ సర్వీసులలోకి మూవ్ చేయటం ద్వారా ఫోన్ స్టోరేజ్ స్పేస్ ఆదా అవుతుంది. హైడెఫినిషన్ ఫోటోలకు బదులు నార్మల్ ఫోటోలను చిత్రీకరించటం స్టోరేజ్ స్పేస్ ఆదా అవుతుంది.

 

ఇన్‌స్టా‌గ్రామ్ ఫోటోలు, ఫోన్‌లోని ఎక్కువ స్పేస్‌ను ఆక్రమించేస్తాయి. కాబట్టి, వాటిని వేరొక చోటకి బ్యాకప్ చేసుకుని డిలీట్ చేసేయండి. డేటా కేబుల్ సహాయంతో ఫోన్‌లోని డేటాను కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌లోకి మూవ్ చేయటం ద్వారా ఫోన్ స్టోరేజ్ స్పేస్ ఆదా అవుతుంది. ఫోన్‌లో నిరపుయోగంగా మారిన యాప్స్‌తో పాటు ఆఫ్‌లైన్ డేటాను క్లియర్ చేయటం ద్వారా ఫోన్ స్టోరేజ్ స్పేస్‌ను క్లియర్ చేసుకోవచ్చు. ఫోన్ ఇంటర్నల్ స్టోరేజ్‌లోని డేటాను మైక్రోఎస్టీ కార్డ్ స్లాట్ లోకి మూవ్ చేయటం ద్వారా ఫోన్ స్టోరేజ్ స్పేస్‌ను ఆదా చేసుకోవచ్చు.

 
 
 
  
 

మరింత సమాచారం తెలుసుకోండి: