ఫోన్‌ లేకుండా ఒక్క క్షణం ఉండలేని వారు చాలా మంది ఉంటారు. ఉద‌యం నిద్ర లేచింది మొద‌లు.. సాయంత్రం ప‌డుకునే వ‌ర‌కు ఫోన్ చేతిలో ఉండాల్సిందే. ఇక ఇంటర్‌నెట్‌ వినియోగం విస్తృతం అయినప్పటి నుంచి సోషల్‌ నెట్‌వర్క్‌ల యూజర్లు కూడా పెరిగారు. ఫోన్‌లో వాట్సప్‌, యూట్యూబ్ అలాగే ఫేస్‌బుక్ ఈ మూడు అంశాలు లేకుండా ఎవరూ స్మార్ట్‌ఫోన్ వాడరు. ముఖ్యంగా ఫేస్‌బుక్.. ఇది జనాల్ని ఎక్కడికో తీసుకెళుతోంది. అయితే ఆండ్రాయిడ్‌లో ఫేస్‌బుక్ వాడుతున్న‌వారు ఈ టిప్స్‌ను ఖ‌చ్చితంగా ఫాలో అవ్వండి.

 

మీ ఫేస్‌బుక్ కి సెక్యూరిటీ చాలా అవసరం లేకుంటే ఎవరైనా దూరి అసభ్య పోస్టులు చేసే ప్రమాదం ఉంది .అందుకని సెట్టింగ్ లో కెళ్లి మీ సెక్యూరిటీని మరింత శక్తివంతంగా ఉండేలా చూసుకోండి. మీరు మెసేంజర్ లో కెళ్లి మీకు కావాలిసిన ఫ్రెండ్స్ ని సెలక్ట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన ఫ్రెండ్స్ తో ఛాటింగ్ చేసుకోవచ్చు. క్రోమ్ బ్రౌజర్‌లో ఫేస్‌బుక్ వాడేవారు మీ బ్యాటరీని కూడా సేవ్ చేసుకోవచ్చు. మీరు క్రోమ్‌లో డైరెక్ట్‌గా ఫేస్‌బుక్‌లోకి వెళ్లడం ద్వారా మీరు మీ బ్యాటరీని సేవ్ చేసుకోవచ్చు. ఫేస్‌బుక్‌ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్ లోడ్ చేసుకుంటే అది ఎప్పుడూ ఆన్‌లో ఉండటం వల్ల మీ బ్యాటరీ తినేసే ప్రమాదం ఉంది. 

 

మీరు మీ ఫేస్ బుక్ పేజీలో వీడియోస్ ని సేవ్ చేసుకుని తరువాత చూడొచ్చు. అలాగే పోస్టును హైడ్ చేయవచ్చు. అన్ ఫాలో కావచ్చు. ఆ లింక్ మీకు బాటా నచ్చి మీరు బిజీలో ఉన్నట్లయితే దాన్ని అలా వదిలేయకుండా రైట్ సైడ్ క్లిక్ చేసి మీరు సేవ్ వీడియో అని సెలక్ట్ చేసుకుంటే మీకు కావలిసిన టైంలో దానిని చూడొచ్చు. ప్రతి రోజు మీ ప్రెండ్స్ ఎంతోమంది తమ వాల్ లో పోస్టులు పెడుతుంటారు. అయితే అవి అందరికీ నచ్చకపోవచ్చు. వాటన్నింటిని చూడాలంటే మనకు కూడా డేటా బొక్క పడుతుంది. కాబట్టి వాటిని అన్ పాలో చేస్తే ఏ సమస్యా ఉండదు.

మరింత సమాచారం తెలుసుకోండి: