ప్రస్తుత కాలంలో ప్రతీ ఒక్కరికీ స్మార్ట్‌ఫోన్ వినియోగం తప్పనిసరిగా మారింది. మెలకువగా ఉంటే చేతిలో, నిద్రపోతే పక్కలో ఫోన్‌ ఉండాల్సిందే. దీంతోపాటు కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, కెమెరాల వాడకమూ పెచ్చరిల్లిపోతున్నాయి. అయితే స్మార్ట్‌ఫోన్‌ వినియోగం ఎక్కువవుతున్నకొద్దీ వచ్చే రోగాల సంఖ్య పెరగడంతో పాటు మనుషుల మధ్య సంబంధాలూ దెబ్బ తింటున్నాయన్నది నగసత్యం. ఇక ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే.. స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తున్న వారంద‌రూ కొన్ని విష‌యాలు త‌ప్ప‌కుండా తెలుసుకోవాలి.

 

చాలా మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఫోన్‌లు పక్కలో లేనిదే నిద్రరాదంటున్నారు. ఫోన్‌లను పిల్లో క్రింద ఉంచుకుని నిద్రపోయే అలవాటు ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నప్పటికి వాటిని పట్టించుకోవటం లేదు. నిద్రలోనూ ఫోన్‌లను దగ్గరగా ఉంచుకోవటం వల్ల ఎన్నో స‌మ‌స్య‌లు వ‌స్తాయో ఓ లుక్కేసేయండి. ఫోన్‌లను పక్కన పెట్టుకుని నిద్రపోవటం వల్ల నిద్రకు భంగం వాటిల్లుతుంది. ఎందుకంటే.. డేటా ఆన్ చేసి ఉన్న ఫోన్‌కు తరచూ నోటిఫికేషన్స్ అలానే మెసేజెస్ వస్తుంటాయి. ఇవి పదేపదే శబ్దాలు చేయటం వల్ల మీకు సరిగా నిద్ర పట్టదు.

 

ఫోన్‌లను ఛాతీకి దగ్గరగా ఉంచుకుని నిద్రపోవటం వల్ల హార్ట్ అటాక్‌కు దారితీసే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ బ్లూ‌లైట్ ఎక్స్‌పోజర్ మీలోని మెలాటోనిన్ హార్మోన్‌ను దెబ్బతీయటమే కాకుండా బ్రెస్ట్ ఇంకా ప్రోస్టేట్ కాన్సర్‌లను సృష్టించే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. స్మార్ట్‌ఫోన్ లైట్ ఎక్స్‌పోజర్ కారణంగా మెలాటోనిన్ హార్మోన్‌ను కోల్పొయిన వారిని ఒత్తిడి చుట్టుముడుతుంది. స్మార్ట్‌ఫోన్ ద్వారా వెలువడే బ్లూ‌లైట్ స్ర్కీన్ కంటి చూపును దెబ్బ తీసే ప్రమాదముందని పలు పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: