ప్రస్తుతం ఉన్న టెక్ యుగంలో స్మార్ట్ ఫోన్ కొనేటప్పుడు అన్ని విష‌యాల్లోనూ చెక్ చేసుకుంటాం. బ్యాట‌రీ, కెమెరా, ర్యామ్‌, బ‌డ్జెట్ ఇలా ప్ర‌తి ఒక్క‌టి మ‌న‌కు న‌చ్చితేనే స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయ‌గ‌లం. ముఖ్యంగా మనదేశంలో బడ్జెట్ ఫోన్లకు ఉండే మార్కెట్టే వేరు. మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఈ ఫోన్ల వైపే మొగ్గు చూపుతూ ఉంటారు. ఇంకొంతమంది ఫోన్ తో, వాటి ఫీచర్లతో ఎక్కువ పని లేదు. కేవలం కాల్స్, కొన్ని బేసిక్ ఫీచర్లకు ఫోన్ ఉంటే చాలు అనుకుంటూ ఉంటారు.

 

అయితే బ‌డ్జెట్ ప‌రంగా, ఫీచ‌ర్ల ప‌రంగా.. అదిరిపోయే ఆఫ‌ర్ల‌తో అమెజాన్‌లో స్మార్ట్‌ఫోన్ సేల్ జ‌రుగుతోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. అమెజాన్‌లో ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ 2020 ప్రారంభమైంది. ఫిబ్రవరి 29 వరకు ఈ సేల్ కొనసాగుతుంది. అంటే ఈ ఒక్క రోజే గ‌డువు మిగిలి ఉంది. ఇక ఎప్పట్లాగే స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లు ప్రకటించింది అమెజాన్.  సో.. వాటిపై ఓ లుక్కేసి మీకు న‌చ్చిన స్మార్ట్‌ఫోన్ ఎంచుకోండి. 

 

- ఒప్పో ఏ7.. దీని అసలు ధర రూ.16,990. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ 3జీబీ+64జీబీ వేరియంట్ రూ.8,990 ధరకే అమెజాన్‌లో ల‌భిస్తోంది.

 

- షావోమీ ఎంఐ ఏ3 స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయినప్పుడు 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.14,999. ప్రస్తుతం రూ.11,999 ధరకే కొనొచ్చు. ఎక్స్‌ఛేంజ్‌పై రూ.1,000 అదనంగా డిస్కౌంట్ కూడా పొందొచ్చు.

 

- హువావే పీ30 లైట్ స్మార్ట్‌ఫోన్ 4జీబీ+128జీబీ వేరియంట్ అసలు ధర రూ.21,990. అయితే ఆమెజాన్‌లో ఇది కేవ‌లం రూ.12,990 ధ‌ర‌కు ల‌భిస్తుంది.

 

- రెడ్‌మీ కే20 ప్రో స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.24,999. అయితే ఎక్స్‌ఛేంజ్‌పై రూ.3,000 అదనంగా డిస్కౌంట్ లభిస్తుంది.

 

- రియల్‌మీ ఎక్స్‌టీ 4జీబీ+64జీబీ వేరియంట్ అసలు ధర రూ.16,999. కానీ, అమెజాన్‌లో రూ.14,999 ధ‌ర‌కే ఈ స్మార్ట్‌పోన్‌ను మీరు పొందొచ్చు. 

 

- సాంసంగ్ గెలాక్సీ ఎం30 గతేడాది విడుద‌లైంది. ఇక‌ గతంలో రూ.11,000 ఉన్న ఫోన్ ధర తగ్గింది. ప్రస్తుతం రూ.9,499 ధరకే సాంసంగ్ గెలాక్సీ ఎం30 స్మార్ట్‌ఫోన్ 3జీబీ+32జీబీ వేరియంట్ ల‌భిస్తోంది. ఇంకెందుకు ఆల‌స్యం మీకు న‌చ్చిన స్మార్ట్‌ఫోన్‌ను ఎంచుకుని కొనుగోలుచేసేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: