మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఆన్‌లైన్‌ షాపింగ్‌ పెరుగుతోంది. దీంతో సాధారణ షాపుల యాజమాన్యాలు బెంబేలెత్తుతున్నాయి. ప్రస్తుతం యువత ఎక్కువగా ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేయడంతో మార్కెట్‌లో అమ్మకాలు లేక వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. అయిన‌ప్ప‌టికీ జ‌నాలు మాత్రం ఆన్‌లైన్ షాపింగ్‌కే మొగ్గు చూపుతున్నారు. అయితే ఈ క్ర‌మంలోనే ఆన్‌లైన్‌ షాపింగ్‌ మోసాలు పెరుగుతున్నాయి. కాబ‌ట్టి ఆన్‌లైన్ షాపింగ్ చేసేవాళ్లు ఖ‌చ్చితంగా ఇప్పుడు చెప్ప‌బోయే టిప్స్ ఫాలో అవ్వాల్సిందే. ఎందుకంటే.. అప్పుడే మీరు ఆన్‌లైన్ షాపింగ్ మోసాలు, ఇత‌రిత‌ర స‌మ‌స్య‌ల‌ నుండీ త‌ప్పించుకోగ‌ల‌రు.

 

మీ ఆన్‌లైన్ కొనుగోళ్లకు సంబంధించిన లావాదేవీలను ప్రింట్ రూపంలో మీ వద్ద భద్రంగా ఉంచుకోండి. మీరు ఆర్డర్ చేసిన ఉత్పత్తులకు సంబంధించి భవిష్యత్‌లో ఏదైనా సమస్య ఎదురైతే వీటి ఉపయోగం ఖ‌చ్చితంగా ఉంటుంది. మీ ఆన్‌లైన్ షాపింగ్‌కు మార్కెట్లో పాపులర్ అయిన ఈ-కామర్స్ సైట్‌లలో మాత్రమే ఎంపిక చేసుకోండి. గుర్తింపులేని ఫేక్ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌ల జోలికి అస్స‌లు వెళ్లకండి. మీరు కోనుగోలు చేసే వస్తువు డెలివరీకి సంబంధించి పూర్తి వివరాలను క‌రెక్ట్‌గా తెలుసుకోండి.

 

అలాగే వస్తువు డెలివరీకి సంబంధించి ఖచ్చితమైన చిరునామాను ఇవ్వండి. షాపింగ్ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే ఆకౌంట్‌లను లాగ్‌అవుట్ చేయటం మాత్రం మ‌ర‌చిపోకండి. ఆన్‌లైన్ షాపింగ్ సైట్‌లలో అనవసరంగా మీ వ్యక్తిగత వివరాలను ఎంటర్ చేయవద్దు. మ‌రియు సెక్యూరిటీ కోడ్ విషయంలో చాలా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి. అదేవిధంగా, ఆన్‌లైన్ షాపింగ్‌కు క్రెడిట్ కార్డులను ఉపయోగించటం చాలా సురక్షితమైన‌ది. ఆన్‌లైన్ ఫ్రాడ్ ప్రొటెక్షన్ ఫీచర్ సహాయంతో క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించటం ద్వారా మీ షాపింగ్ మరింత సురక్షితంగా, సౌక‌ర్యంగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: