స్మార్ట్‌ ఫోన్‌.. మొబైల్‌ ప్రపంచంలో పెను మార్పును తెచ్చింది. ప్రపంచాన్ని మన అరచేతిలోకి తెచ్చేసింది. డెస్క్‌ టాప్‌... ల్యాప్‌ టాప్‌... ట్యాబ్లెట్లు... ఎన్ని వచ్చినా అరచేతిలో ఇమిడిపోయే బుల్లి కంప్యూటర్‌ స్మార్ట్‌ఫోన్‌.  అవసరాలకు మొబైల్‌ చాలా అవసరం అయిపోయింది. సమాచారమైనా, చేస్తున్న ఉద్యోగం, వ్యాపారం, ఏ పనైనా కావచ్చు. ఫోను లేకుండా రోజు గడవడం కష్టమే. అయితే ఎంతో క‌ష్ట‌ప‌డి, ఇష్ట‌ప‌డి స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తారో.. అంటే ఇష్టంగా దాన్ని చూసుకోవాలి. కొంత మంది కొత్త ఫోన్‌కు ఏ విధమైన ప్రొటెక్షన్‌ను కల్పించకుండా ఇష్టమొచ్చినట్లు రఫ్ అండ్ టఫ్‌‍గా వాడేస్తుంటారు.

 

ఇలా చేయ‌డం వ‌ల్ల మీ స్మార్ట్‌ఫోన్ త్వ‌ర‌గా పాడైపోతుంది. కాబ‌ట్టి కొంత స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసిన వెంటనే, ఆ ఫోన్ నిమిత్తం వీలైనంత త్వరగా చేయవల్సిన కొన్ని ముఖ్యమైన పనులు ఏంటీ అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఫోన్ వెనుక భాగాన్ని స్ర్కాచ్ ప్రూఫ్‌గా ఉంచుకునేందుకు ట్రెండీ లుక్‌లో ఉన్న ఓ సాలిడ్ బ్యాక్ కవర్‌ను ఏర్పాటు చేసుకోండి. ఇది ఈ ఫోన్‌కు మంచి ప్రొటెక్ష‌న్‌గా ఉంటుంది. మ‌రియు మీ కొత్త ఫోన్ యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపరుచుకునేందుకు ఉపయుక్తమైన బ్రాండెడ్ యాక్సెసరీస్‌ను కొనుగోలు చేసుకోండి.

 

అలాగే మీరు కొనుగోలు చేసిన కొత్త ఫోన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అయ్యేది అయితే వెంటనే డివైస్‌లోని గూగుల్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఆండ్రాయిడ్ డివైస్ మేనేజ‌ర్‌ ఆప్షన్‌ను యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయటం పొరపాటున మీ ఫోన్ మిస్సైనట్లయితే గూగుల్ ద్వారా సులువుగా ప‌ట్టుకోవ‌చ్చు. ఇక కంపెనీలు స్మార్ట్‌ఫోన్‌లకు ఇన్స్యూరెన్స్‌ను ఆఫర్ చేస్తున్నాయి. ఫోన్‌కు సంబంధించి ఫిజికల్ అలానే లిక్విడ్ డ్యామెజీలను ఈ ఇన్స్యూరెన్స్ కవర్ చేస్తుంది. కాబట్టి మీ కొత్త స్మార్ట్‌ఫోన్ పేరుమీద ఓ ఇన్స్యూరెన్స్ పాలసీని పొంద‌డం చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: