ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఒప్పో నుంచి ఇటీవ‌ల‌ లాంచ్ అయిన కొత్త మోడల్ ఒప్పో ఏ9 202 స్మార్ట్ ఫోన్‌పై భారతదేశంలో రూ.1,000 తగ్గింపును అందించారు. దీంతో ఈ స్మార్ట్ ఫోన్ 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర ప్రస్తుతం రూ.17,490గా ఉండగా, 4 జీబీ ర్యామ్ + 128 జీబీ వేరియంట్ ధర ఇప్పుడు రూ.14,990గా ఉంది. వాస్త‌వానికి విడుద‌లైన కొత్త‌లో ఒప్పో ఏ9 2020..  4 జీబీ ర్యామ్ + 128 జీబీ వేరియంట్ ధర రూ.16,999గానూ, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ వేరియంట్ ధరను రూ.19,990గా నిర్ణయించారు. 

 

అయితే ఈ ఫోన్‌పై ఇంతకుముందు కూడా రూ.1,000 ధర తగ్గింపును లభించింది. అప్పుడు 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.18,490కు, 4 జీబీ ర్యామ్ + 128 జీబీ వేరియంట్ ధరను రూ.15,990 కు తగ్గించారు. ఒప్పో ఏ9 2020 ధర తగ్గింపు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల్లో కూడా కనిపిస్తుంది. ఈ తాజా ధరల తగ్గింపు ఆఫ్‌లైన్ స్టోర్లకు కూడా వర్తిస్తుందని ఒప్పో తెలిపింది. ఇక స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. ఇందులో స్క్రీన్ సైజ్ 6.5 అంగుళాలుగా ఉంది. సెల్ఫీ కెమెరా కోసం వాటర్ డ్రాప్ నాచ్, గొరిల్లా గ్లాస్ 3+ ప్రొటెక్షన్ కూడా ఇందులో ఉన్నాయి. అలాగే ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. 

 

ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ కాగా, 8 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్, 2 మెగా పిక్సెల్ పొర్ ట్రెయిట్ లెన్స్, 2 మెగా పిక్సెల్ మోనో లెన్స్ కూడా ఇందులో ఉన్నాయి. అల్ట్రా వైడ్ లెన్స్ 119 డిగ్రీల వరకు సపోర్ట్ చేస్తుంది. ఇక సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. ఇందులో అల్ట్రా నైట్ మోడ్ కూడా అందుబాటులో ఉంది. ఇందులో బ్యాటరీ సామర్థ్యం 5,000 ఎంఏహెచ్‌గా ఉంది. మ‌రియు ఒప్పో ఏ9 2020 స్మార్ట్ ఫోన్ రివర్స్ చార్జింగ్ ను కూడా సపోర్ట్ చేయడం విశేషం. ఇక అక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 665 ప్రాసెసర్ పై ఇది పనిచేయనుంది. గేమ్స్ ఎక్కువగా ఆడేవారి కోసం ఇందులో గేమ్ బూస్ట్ 2.0 అనే ప్రత్యేక ఫీచర్ ను అందించారు. ఇంకెందుకు అల‌స్యం.. త్వ‌ర‌ప‌డండి..!
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: