స్మార్ట్‌.. స్మార్ట్‌.. అంతా స్మార్ట్‌ మయంగా మ‌రిపోయింది.    స్మార్ట్‌ ఫోన్ మొబైల్‌ ప్రపంచంలో పెను మార్పును తెచ్చింది. ప్రపంచాన్ని మన అరచేతిలోకి తెచ్చేసింది. డెస్క్‌ టాప్‌, ల్యాప్‌ టాప్‌, ట్యాబ్లెట్లు ఎన్ని వచ్చినా అరచేతిలో ఇమిడిపోయే బుల్లి కంప్యూటర్‌ స్మార్ట్‌ఫోన్‌. ఇక స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో మనం అనుకున్న బడ్జెట్లో కొనుగోలు చేయాల‌నుకుంటారు. అయితే ఫిబ్ర‌వ‌రి నెల‌లో భారీ త‌గ్గింపు పొందిన స్మార్ట్ ఫోన్ల‌పై ఓ లుక్కేసి.. మీకు న‌చ్చిన ఫోన్‌ను ఎంచుకోండి.

 

 శాంసంగ్ గెలాక్సీ ఏ70ఎస్.. 6.7 అంగుళాల ఇన్ ఫినిటీ-యూ సూపర్ అమోఎల్ఈడీ డిస్ ప్లే,  క్వాల్ కాం ఎస్ఎం6150 ప్రాసెసర్,  64 మెగా పిక్సెల్ + 5 మెగా పిక్సెల్ + 8 మెగా పిక్సెల్ కెమెరా, 32 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా, 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. రిలీజ్ అయిన‌ప్పుడు దీని ధ‌ర రూ.28,999 కాగా, ఫిబ్ర‌వ‌రిలో రూ.25,999కి త‌గ్గింది.

 

రెడ్ మీ నోట్ 8 ప్రో.. 6.53 అంగుళాల హెచ్ డీఆర్ డిస్ ప్లే, 64 మెగా పిక్సెల్ + 8 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్ కెమెరా,  20 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా, 4,500 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. రిలీజ్ అయిన‌ప్పుడు దీని ధ‌ర రూ.14,999 కాగా, ఫిబ్ర‌వ‌రిలో రూ.13,999కి త‌గ్గింది.

 

ఒప్పో రెనో 2F.. 6.5 అంగుళాల అమోఎల్ఈడీ డిస్ ప్లే, 48 మెగా పిక్సెల్ + 8 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్ కెమెరా, 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా, 4,000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. రిలీజ్ అయిన‌ప్పుడు దీని ధ‌ర రూ.23,999 కాగా, ఫిబ్ర‌వ‌రిలో  రూ.21,999కి త‌గ్గింది.


 
 

 

 

 
 
 
 
   

 
 
  
  

మరింత సమాచారం తెలుసుకోండి: