ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో రియల్‌మీ దూకుడు కొనసాగిస్తోంది. వరుసగా స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేస్తూ యూజర్లను కన్‌ఫ్యూజ్ చేస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది మొద‌టిలో లాంచ్ చేసిన మొట్టమొదటి ఫోన్ రియల్‌మీ 5ఐ.  రియల్‌మీ 5 సిరీస్‌లో ఇప్పటికే రియల్‌మీ 5 ప్రో, రియల్‌మీ 5, రియల్‌మీ 5ఎస్ రిలీజ్ చేసిన కంపెనీ.. బడ్జెట్ సెగ్మెంట్‌పై గురిపెట్టింది. దీంతో తక్కువ ధరలో రియల్‌మీ 5ఐ రిలీజ్ చేసింది. అయితే ఇప్పుడు భారతదేశంలో ఈ ఫోన్ కొత్త వేరియంట్‌ను అందించారు. 

 

ఈ కొత్త వేరియంట్ 128 జీబీ స్టోరేజ్ సామర్థ్యంతో వస్తుంది. రియల్‌మీ 5ఐ జనవరిలో కేవలం 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో మాత్రమే లాంచ్ అయింది. మనదేశంలో రియల్‌మీ 5ఐ 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,999గా నిర్ణయించారు. ఇది 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ కంటే రూ.1,000 ఎక్కువ. ఈ ఫోన్ లోని ఫీచర్ల విష‌యానికి వ‌స్తే..  6.52 అంగుళాల హెచ్‌డీ+ ఇన్-సెల్ డిస్ ప్లేను అందించారు. ఆక్టా-కోర్ క్వాల్ కాం స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది.

 

4 జీబీ ర్యామ్ ను ఇందులో అందించారు. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాల సెటప్‌ను అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 12 మెగాపిక్సెల్ కాగా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్‌, 2 మెగా పిక్సెల్ పొర్ ట్రెయిట్, 2 మెగా పిక్సెల్ మాక్రో లెన్స్ ను అందించారు. సెల్ఫీల కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. . ఫోన్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. మ‌రియు 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని కూడా అందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: