ఇటీవ‌ల అధికంగా వాడుతున్న యాప్స్‌లో ఫేస్‌బుక్ కూడా ఒక‌టి. ముఖ్యంగా ఇండియాలో ఫేస్‌బుక్ వినియోగం శ‌ర‌వేగంగా దూసుకుపోతోంది. ఎంతోమంది స్నేహితులను, బంధువులను దగ్గర చేయడమే కాదు, వారి అనుభవాలను, అనుభూతులను పంచుకునేందుకు ఈ యాప్ ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణంగా మారింది. ఈ క్ర‌మంలోనే  చాలా మంది ఉద‌యం నిద్ర లేచింది మొద‌లుకొని రాత్రి మ‌ళ్లీ నిద్రించే వ‌ర‌కు ఫేస్‌బుక్ ప్ర‌పంచంలో విహ‌రిస్తూనే ఉంటున్నారు. ఇక ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే.. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‍‌బుక్ మన సెర్చ్ హిస్టరీని సేవ్ చేసి ఓ పద్ధితిలో డేటా బేస్‌ను క్రియేట్ చేస్తుంది. 

 

సేవ్ చేయబడిన సెర్చ్ హిస్టరీ ద్వారా కంటెంట్‌ను సలువుగా వెతుక్కునేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది. అయితే ఫేస్‌బుక్ సెర్చ్ హిస్టరీని ఎప్పటికప్పుడు డిలీట్ చేసుకోవటం కూడా మంచిది. మ‌రి సెర్చ్ హిస్ట‌రీని ఎలా డిలీట్ చేయాలో కొంద‌రికి అవ‌గాహ‌న లేక‌పోవ‌చ్చు. అలాంటి వారు ఇప్పుడు చెప్ప‌బోయే టిప్స్ ఫాలో అయితే ఫేస్‌బుక్ సెర్చ్ హిస్ట‌రీని సులువుగా డిలీట్ చేసుకోవ‌చ్చు. అందుకు ముందు మీ ఫేస్‌బుక్ అకౌంట్ లాగిన్ కావాలి.  ఇప్పుడు హోమ్ పేజీ పై బాగం రైట్ కార్నర్‌లో కనిపించే డౌన్ యారో పై క్లిక్ చేసినట్లయితే ఓ డ్రాప్ డౌన్ మెనూ ఓపెన్ అవుతుంది. 

 

అందులోని యాక్టివిటీ లాగ్‌ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేసిన వెంటనే వివిధ ఆప్షన్‌లతో కూడిన ఓ లిస్ట్ స్క్రీన్‌ ఎడమ వైపు కనిపిస్తుంది. ఆ లిస్ట్ ను మరింతగా ఎక్స‌పేండ్ చేసేందుకు మోర్‌పై క్లిక చేయాలి. ఇప్పుడు కనిపించే లిస్ట్‌లో సెర్చ్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. దీంతో మీరు సెర్చ్ చేసిన అంశాలు ఓపెన్ అవుతాయి. వాటిలో మీరు డిలీట్ చేయాలనుకుంటున్న ఎంచుకుని ఆ సెర్చ్ కు సంబంధింకి బ్లాక్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే డిలీట్ ఆప్షన్ మీకు కినిపిస్తుంది. ఆ ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే మీరు తొలగించాలనుకుంటున్న సెర్చ్ డిలీట్ అవుతుంది. 

 
 
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: