ఇటీవ‌ల కాలంలో రియ‌ల్‌మీ స్మార్ట్‌ఫోన్ల‌కు ఏ రేంజ్‌లో క్రేజ్ పెరిగిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ ఫోన్ల తయారీ కంపెనీ రియల్‌మీ అంతే స్థాయిలో యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకునేందు ప్ర‌య‌త్నిస్తుంది. ఇక తాజాగా రియల్‌మీ 6 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లను విడుద‌ల చేసింది. ఈ సిరీస్‌లో రియల్‌మీ 6, రియల్‌మీ 6 ప్రో మోడల్స్‌ని పరిచయం చేసింది. ఇక ఇప్ప‌టికే  మార్చిలో ఆన్ గ్రౌండ్ ఈవెంట్స్ నిర్వహించట్లేదని కంపెనీ ప్రకటించింది. లాంఛింగ్ ఆన్‌లైన్‌లోనే ఉంటుందని వివరించింది. 

 

ఈ క్ర‌మంలోనే తాజాగా లైవ్ స్ట్రీమింగ్ ద్వారా కొత్త ప్రొడక్ట్స్‌ని ఆవిష్కరించింది. ఒకేసారి ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో ఈ ప్రొడక్ట్స్‌ని రిలీజ్ చేసింది. రియల్‌మీ 5 ప్రో అప్‌గ్రేడ్ వర్షన్‌గా రియల్‌మీ 6 ఫోన్‌ను ప్రకటిస్తే.. రియల్‌మీ 6 ప్రో మోడల్‌ను కొత్తగా ఆవిష్కరించింది కంపెనీ. ఇక‌ రియల్‌మీ 6 ప్రారంభ ధర రూ.12,999. సేల్ మార్చి 11 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. మ‌రియు రియల్‌మీ 6 ప్రో ప్రారంభ ధర రూ.16,999. సేల్ మార్చి 13 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది.

 

రియల్‌మీ 6 స్పెసిఫికేషన్స్ విష‌యానికి వ‌స్తే.. 
- 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే
- మీడియాటెక్ హీలియో జీ90టీరియర్ ప్రాసెసర్
- 64+8+2+2 మెగాపిక్సెల్ కెమెరా, 16 మెగాపిక్సెల్ఫ్రంట్ కెమెరా
- 4జీబీ, 6జీబీ, 8జీబీ ర్యామ్
- 64జీబీ, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
- 4,300 ఎంఏహెచ్ బ్యాటరీ
- డ్యూయెల్ సిమ్+మైక్రో ఎస్డీ స్లాట్ సిమ్ సపోర్ట్
- 4జీబీ+64జీబీ ధ‌ర‌ రూ.12,999, 6జీబీ+128జీబీ ధ‌ర‌ రూ.14,999, 8జీబీ+128జీబీ ధ‌ర‌ రూ.15,999.


 
రియల్‌మీ 6 ప్రో స్పెసిఫికేషన్స్ విష‌యానికి వ‌స్తే.. 
- 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే
- క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720జీ ప్రాసెసర్
- 64+8+12 మెగాపిక్సెల్+ మైక్రో కెమెరా, 16+8 మెగాపిక్సెల్ డ్యూయెల్ హోల్ పంచ్ ఫ్రంట్ కెమెరా
- 6జీబీ, 8జీబీ ర్యామ్
- 64జీబీ, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
- 4,300 ఎంఏహెచ్ బ్యాటరీ
- డ్యూయెల్ సిమ్+మైక్రో ఎస్డీ స్లాట్ సిమ్ సపోర్ట్
- 6జీబీ+64జీబీ ధ‌ర‌ రూ.16,999, 6జీబీ+128జీబీ ధ‌ర రూ.17,999, 8జీబీ+128జీబీ ధ‌ర‌ రూ.18,999. 

మరింత సమాచారం తెలుసుకోండి: