ప్ర‌స్తుతం ప్ర‌పంచాన్ని సోష‌ల్ మీడియా ఎలా శాసిస్తుందో ?  ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇప్పుడు ప్ర‌పంచం అంతా వాట్సాప్‌, ఫేస్‌బుక్ మ‌యం అయిపోయింది. సోష‌ల్ మీడియా ఉండ‌డంతో ఇప్పుడు క్ష‌ణాల్లోనే ప్ర‌పంచం అంతా స‌మాచారం స్ప్రెడ్ అయిపోతోంది. ఈ సోష‌ల్ మీడియా వెబ్ సైట్స్ ఇప్పుడు అగ్ర రాజ్యం అమెరికాకు క‌ల్ప వృక్షం లాంటిది. ఇక కొద్ది రోజుల క్రితం మోడీ తాను సోష‌ల్ మీడియాకు దూరంగా ఉంటాన‌ని ప్ర‌క‌టించ‌డం కూడా పెద్ద సంచ‌ల‌న‌మైన సంగతి తెలిసిందే.

 

మోడీ ప్ర‌క‌ట‌న వెన‌క మ‌న దేశంలో ఫేస్‌బుక్‌, వాట్సాప్‌తో సోష‌ల్ మీడియా సంస్థ‌ల‌ను నిషేధించాల‌న్న ఆలోచ‌న కూడా ఆయ‌న‌కు ఉంద‌న్న సందేహాలు వ్య‌క్త మ‌య్యాయి. ఇక ఇప్పుడు మ‌న దేశంలో ఈ సోష‌ల్ మీడియా సంస్థ‌ల‌ను నిజంగానే నిషేధించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయా ? అంటే అవున‌న్న సందేహాలే క‌లుగుతున్నాయి. భారత ప్రభుత్వం సొంత సోషల్ మీడియాను రూపొందించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త్‌కు ఎలాంటి సోష‌ల్ మీడియా మాధ్య‌మాలు లేవు. దీంతో ఇప్పుడు కేంద్ర ప్ర‌భుత్వం ఆ దిశ‌గా ప్ర‌ణాళిక‌లు రచిస్తోంద‌ట‌.

 

ఇక ఈ విష‌యాన్ని టెక్ మహీంద్రా సీటీఓ జాతీయ భద్రతా నిపుణుడు అమిత్ దుబే తెలిపారు. దీనిపై ఆయ‌న మాట్లాడుతూ సొంత ఫేస్‌బుక్ క్రిప్టోకరెన్సీ వాట్సాప్ లాంటి వాటిని రూపకల్పన చేస్తున్న‌ట్టు చెప్పారు. ఇక భార‌తదేశ పౌరుల వ్య‌క్తిగ‌త డేటా బ‌య‌ట‌కు వెళ్లిపోతుంద‌న్న ఆందోళ‌న‌లు ఎప్ప‌టి నుంచో ఉన్నాయి. చైనాలో వాట్సాప్, ఫేస్‌బుక్ ప‌నిచేయ‌ద‌ని దుబే తెలిపారు. ఇక పౌరుల భ‌ద్ర‌త కోసం కేంద్ర ప్ర‌భుత్వం తీసుకుంటోన్న చ‌ర్య‌ల్లో భాగంగా ఈ కొత్త సోష‌ల్ మీడియా వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేస్తున్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: