దిశ యాప్.. మహిళల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోచ్చిన యాప్ ఇది. ఫోన్‌లో ఈ చిన్న యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే చేసుకుని.. ఆపద సమయంలో చిన్న బటన్ నొక్కితే ఐదు నిమిషాల్లో పోలీసులు స్పాట్‌కు చేరుకునేలా యాప్‌ను తయారుచేశార‌న్న సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే దిశ యాప్ ద్వారా కొందరు సేఫ్ గా బయటపడ్డారు. దీంతో ఈ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేస్తే పోలీసులు స్పందిస్తున్న తీరుపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ యాప్ తాజాగా ఓ కొత్త రికార్డు సృష్టించింది.

 

ఈ యాప్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్స్‌లో 2,00,000 మంది డౌన్‌లోడ్ చేయ‌డంతో కొత్త రికార్డు సృష్టించింది. 'దిశ ఎస్ఓఎస్' యాప్‌ ఫిబ్రవరి 9న గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లో అందుబాటులోకి వచ్చింది. మొదటిసారి డౌన్‌లోడ్ చేయడానికి మాత్రమే ఇంటర్నెట్ అవసరం. యాప్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఉపయోగించడానికి ఇంటర్నెట్ అవసరం లేదు. ఈ యాప్ డౌన్‌లోడ్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్‌తో లాగిన్ చేయాల్సి ఉంటుంద‌న్న సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్‌లో దిశ యాప్‌కు 4.7/5 స్టార్ రేటింగ్ ఉండటం మరో విశేషం. 

 

ఈ యాప్ ద్వారా ఎక్కువగా భార్యలపై భర్తల దాడులు, అసభ్యకర చేష్టలు, లైంగిక వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులే ఎక్కువగా వచ్చాయని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఇక  ఆపదలో ఉన్నవారు ఈ యాప్‌ను ఓపెన్‌ చేసి అత్యవసర సహాయం(ఎస్‌వోఎస్‌) బటన్‌ నొక్కితే చాలు.. వారి ఫోన్‌ నంబర్, చిరునామా, వారున్న ప్రదేశం వివరాలు దిశ కంట్రోల్‌ రూమ్‌కు చేరతాయి. అలాగే దిశ యాప్ ఓపెన్ చేసి ఎస్ఓఎస్ బటన్ ప్రెస్ చేసేంత సమయం లేకపోతే ఫోన్‌ని గట్టిగా ఊపినా చాలు. మీరు ఎక్కడున్నారో లొకేషన్ కంట్రోల్ రూమ్‌కు వెళ్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: