ఇటీవ‌ల కాలంలో ఎవరైనా కొత్త స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తే.. పక్కనవాళ్లు అడిగే ప్రశ్నలు రెండే.. ఫోన్ ఎంత? కెమెరా ఎలా ఉంది?. ఇక చాలా మంది స్మార్ట్‌ఫోన్ కొనే ముందు కెమెరాపైనే ఎక్కువ దృష్టి పెడ‌తారు. ఎందుకంటే.. మన జీవితంలోని బెస్ట్ మూమెంట్స్ అయినా, సరదాగా స్నేహితులను తీసుకునే ఫొటోలు అయినా బాగా రావాలంటే మన స్మార్ట్ ఫోన్ లో మంచి కెమెరా ఉండటం తప్పనిసరి కాబ‌ట్టి. అయితే ఫోటోలు తీసేట‌ప్పుడు చాలా త‌ప్పులు చేస్తుంటాం. వాటిపై ఓ లుక్కేసి అవి రిపీట్ కాకుండా చూసుకోండి.

 

ఇటీవ‌ల‌ వచ్చే అన్ని స్మార్ట్ ఫోన్లలో దాదాపుగా మ్యాన్యువల్ మోడ్ అందుబాటులో ఉంటుంది. అయినప్పటికీ ఎక్కువమంది స్మార్ట్ ఫోన్ యూజర్లు ఆటోమేటిక్ మోడ్ నే ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ ఆటోమేటిక్ మోడ్ మీ స్మార్ట్ ఫోన్ కెమెరా సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించనివ్వదు. అలాగే పోకెట్స్‌లో, బ్యాగుల్లో, కాఫీ టేబుల్ మీద, నేల మీద ఇలా మనకు సౌకర్యంగా ఉన్న చోట ఫోన్‌ను పెడుతూ ఉంటాం. కాబట్టి వీటి మీద చాలా దుమ్ము పడే అవకాశం ఉంటుంది. 

 

కెమెరా లెన్స్ మీద మట్టి పడితే అప్పుడు ఫొటోలు సరిగ్గా రావు. సో.. మీ కెమెరా లెన్స్ ను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అలాగే లైటింగ్ కాస్త తక్కువగా ఉన్నప్పుడు మనం ఫ్లాష్ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే.. కొన్ని సార్లు ఫ్లాష్ ఉపయోగించి ఫొటో తీయడం ద్వారా లైటింగ్ అంత బాగా రాదు. ఫొటోలు కూడా సహజంగా ఉండదు. సో.. ఎప్పుడుప‌డితే అప్పుడు ఫ్లాష్‌ను వాడ‌క‌పోవ‌డ‌మే మంచిది.  

మరింత సమాచారం తెలుసుకోండి: