ఇటీవ‌ల రియల్‌మీ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న రియల్‌మీ 6 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఈ సిరీస్‌లో రియల్‌మీ 6, రియల్‌మీ 6 ప్రో మోడల్స్‌ని పరిచయం చేసింది కంపెనీ. లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఈ కొత్త ప్రొడక్ట్స్‌ని ఆవిష్కరించింది. ఒకేసారి ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో ఈ ప్రొడక్ట్స్‌ని రిలీజ్ చేసింది. అలాగే రియల్‌మీ 5 ప్రో అప్‌గ్రేడ్ వర్షన్‌గా రియల్‌మీ 6 ఫోన్‌ను ప్రకటిస్తే, రియల్‌మీ 6 ప్రో మోడల్‌ను కొత్తగా ఆవిష్కరించింది కంపెనీ. ఇక ఇవి ప‌క్క‌న పెడితే.. రియల్‌మీ 6 స్మార్ట్‌ఫోన్ సేల్  రేపే ప్రారంభం కానుంది.

 

 రియల్‌మీ 6 స్మార్ట్‌ఫోన్‌లో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 90Hz రిఫ్రెష్ రేట్‌తో డిస్‌ప్లే, ఫోన్ వెనుకవైపు కాకుండా సైడ్‌లో ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 30 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ఫీచర్లున్నాయి.సేల్ మార్చి 11 అంటే రేపే.. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. రియల్‌మీ 6 ప్రో ప్రారంభ ధర రూ.16,999. సేల్ మార్చి 13 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. యాక్సిస్ బ్యాంక్ కార్డుతో కొనేవారికి రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది.

 

ఇక రియల్‌మీ 6 స్పెసిఫికేషన్స్ చూస్తే.. 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే 90Hz రిఫ్రెష్ రేట్‌తో ఉండటం విశేషం. మీడియాటెక్ హీలియో జీ90టీరియర్ ప్రాసెసర్, 64+8+2+2 మెగాపిక్సెల్ కెమెరా, 16 మెగాపిక్సెల్ఫ్రంట్ కెమెరా, - 4జీబీ, 6జీబీ, 8జీబీ ర్యామ్,  64జీబీ, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్,  4,300 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో ఉన్నాయి. అలాగే రియల్‌మీ 6 డ్యూయెల్ సిమ్+మైక్రో ఎస్డీ స్లాట్ సపోర్ట్‌తో ఉంటుంది. ఇక రియల్‌మీ 6 స్మార్ట్‌ఫోన్ కోమెట్ బ్లూ, కోమెట్ వైట్ కలర్స్‌లో లభిస్తుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: