ఇటీవ‌ల కాలంలో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్స్ విప‌రీతంగా వినియోగిస్తున్నారు. ముఖ్యంగా డెస్క్‌టాప్ పీసీలకు అప్‌డేటెడ్ వర్షన్‌గా పుట్టుకొచ్చిన ల్యాప్‌‌టాప్‌లు, పోర్టబుల్ కంప్యూటింగ్‌ను చేరువ చేయటంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. విద్యార్థులు మొదలుకుని జాబ్ ప్రొఫెషనల్స్ వరకు ల్యాప్‌టాప్‌లను అనేక విధాలుగా వాడుకుంటున్నారు. అయితే ల్యాప్ కొనే ముందు ఖ‌చ్చితంగా కొన్ని విష‌యాలు తెలుసుకోవాలి. ల్యాప్‌టాప్‌ కొనేముందు ఏ మోడల్‌ మీకు నప్పుతుందో గుర్తించండి. 

 

నెట్‌ బ్రౌజింగ్‌ చేయడం, మెయిల్స్‌ పంపించడం లాంటి పనుల కోసం కొంటున్నారా? గేమ్స్‌ ఆడుకోవడానికి, మ్యూజిక్‌ వినడం కోసమా? లేక గ్రాఫిక్‌ వర్క్స్‌, ఆర్కిటెక్చర్‌ వర్క్స్‌ చేయడం కోసమా? అనే అంశాలు చాలా ముఖ్యం. మీరు ఎంపిక చేసుకునే ల్యాప్‌టాప్‌కు సంబంధించి కీబోర్డ్ ఇంకా టచ్‌ప్యాడ్ పని తీరును చెక్ చేసుకోండి. మీరు ఎంపిక చేసుకునే బ్రాండ్‌ను బట్టే ల్యాప్‌టాప్ పనితీరు ఆధారపడి ఉంటుంది. 

 

కాబట్టి, ల్యాప్‌టాప్ ఎంపిక విషయంలో బ్రాండ్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే మీరు ఎంపిక చేసుకునే ల్యాప్‌టాప్ ఫ్లాష్ స్టోరేజ్ వ్యవస్థను కలిగి ఉండేందిగా చూసుకోండి. ఫ్లాష్ స్టోరేజ్ వ్యవస్థ ఖరీదైనప్పటికి మన్నికైన ఇంకా వేగవంతమైన పనితీరును అందిస్తుంది. ఎంత బడ్జెట్‌లో ల్యాప్‌టాప్‌ తీసుకోవాలనుకుంటున్నారో ముందే నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ల్యాప్‌టా్‌పలో చాలా ఖరీదైనవి కూడా ఉన్నాయి. షాప్‌కు వెళ్లిన తరువాత డైలమాలో పడేకన్నా ముందే బడ్జెట్‌పై అవగాహనతో వెళ్లాలి.

 
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: