స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తోన్న ప్రతి ఒక్కరికి ‘వాట్సాప్‌' సుపరిచితమైన అప్లికేషన్. ఈ చాటింగ్ యాప్ ద్వారా సమచారాన్నిఫోటో ఇంకా వీడియోల రూపంలో షేర్ చేసుకోవచ్చు.  ఇక  ఇటీవ‌ల వాట్సాప్ స్లో అయితే ఎంత గంద‌ర‌గోళం అయిందో చెప్ప‌క్క‌ర్లేదు. ఎందుకంటే.. అంత‌లా వాట్సాప్ క్రేజ్ సంపాధించుకుంది కాబ‌ట్టి. అయితే దీన్ని దుర్వినియోగం చేయకుండా ఉండటం కూడా ముఖ్యమే. లేకపోతే మీ వాట్సాప్ అకౌంట్ పూర్తిగా నిషేధానికి గురవడం లేదా సస్పెండ్ అవ్వడం జరుగుతుంది. తెలిసో, తెలియకో ఆ నిబంధనలను మీరు ఉల్లంఘిస్తే మీ వాట్సాప్ ఖాతా పూర్తిగా పోవడంతో పాటు మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది.

 

కాబ‌ట్టి, వాట్సాప్‌లో పొర‌పాటున కూడా చేయ‌కూడ‌ని త‌ప్పులు ఏంటో ఓసారి లుక్కేసేయండి. సోషల్ మీడియా అంటే నకిలీ ఖాతాలు సహజమే. అలాగే వాట్సాప్ లో కూడా ఫేక్ అకౌంట్లు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. మీరు ఫేక్ అకౌంట్ సృష్టించారన్న విషయం వాట్సాప్ దృష్టికి వెళ్తే ఆ ఖాతాను వాట్సాప్ పూర్తిగా బ్యాన్ చేస్తుంది. కొంతమంది వాట్సాప్ యాప్ కోడ్ ను మార్చాలని చూస్తూ ఉంటారు. అయితే వాట్సాప్ నిబంధనల ప్రకారం అది కూడా విరుద్ధమే. అలాంటి ప‌నులు అస్స‌ల చేయ‌కూడ‌దు.

 

వాట్సాప్ లో మీరు బెదిరింపు మెసేజ్ లతో పాటు నేరాలను ప్రేరేపించే విధంగా ఉండే మెసేజ్ లు కూడా పంపకూడదు. ఈ విధమైన మెసేజ్ లను పంపించడం వాట్సాప్ నిబంధనలకు విరుద్ధం. వాట్సాప్ నియమ నిబంధనల ప్రకారం మీ కాంటాక్ట్ లిస్ట్ లో లేని వారికి ఎక్కువ మెసేజ్ లు పంపకూడదు. బల్క్ మెసేజింగ్, ఆటో మెసేజింగ్, ఆటో డయలింగ్ వంటి వాటిని అస్సలు చేయకూడదు. వాట్సాప్ ప్లస్ అనే థర్డ్ పార్టీ యాప్ ను ఉపయోగించడం కూడా మీరు వాట్సాప్ లో బ్యాన్ అయ్యేలా చేస్తుంది. వాట్సాప్ ప్లస్ యాప్ ను వాట్సాప్ రూపొందించలేదు. మ‌రియు దాన్ని యూజ్ చేయ‌డానికి ప‌రిమీష‌న్ కూడా లేదు. కాబ‌ట్టి ఈ విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాలి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: