గూగుల్ క్రోమ్.. దీని గురించి తెలియ‌ని వారుండ‌రు. వేగవంతమైన వెబ్ బ్రౌజర్‌లలో గూగుల్ క్రోమ్ ఒకటి. గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌ పనితీరు ప్రధానంగా ర్యామ్‌ మీద ఆధారపడి ఉంటుంది. ఎంత ఎక్కువ ర్యామ్‌ ఉంటే అంత వేగంగా అది స్పందిస్తుంది. 2008లో దీన్ని మొట్టమొదటిసారిగా మైక్రోసాఫ్ట్ విండోస్ కోసం తయారు చేశారు. తర్వాత లినక్సు, మాక్ ఓఎస్, ఐఓఎస్, ఆండ్రాయిడ్ లాంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ లో కూడా పనిచేసేలా రూపొందించారు.



దీన్ని ఆధారంగా చేసుకుని గూగుల్ క్రోం ఓఎస్ అనే ఆపరేటింగ్ సిస్టం ను తయారు చేశారు. గూగుల్ క్రోమ్ యూజ్ చేసేవారంద‌రూ ఖ‌చ్చితంగా కొన్ని టిప్స్ & ట్రిక్స్‌ తెలుసుకోవాలి. క్రోమ్ బ్రౌజర్‌లోని సెట్టింగ్స్, పాస్‌వర్డ్స్ అలానే బుక్‌మార్క్‌లను గూగుల్ అకౌంట్ కు సింక్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ను సద్వినియోగం చేసుకోవటం ద్వారా వర్క్ అలానే హోమ్ కంప్యూటర్ ను సలువుగా ఉప‌యోగించుకోవ‌చ్చు. అలాగే తరచుగా ఓపెన్ చేసే ట్యాబ్‌లను పిన్ చేసుకోవచ్చు.



నచ్చిన ట్యాబ్ లను పిన్ చేసుకోవటం ద్వారా వేగవంతమైన యాక్సిస్ ను పొందొచ్చు. ట్యాబ్ ను పిన్ చేసేందుకు ట్యాబ్ పై మౌస్ తో రైట్ క్లిక్ చేసినట్లయితే పలు ఆప్షన్ లతో కూడిన మెనూ ప్రతక్ష్యమవుతుంది. వాటిలో పిన్ ట్యాబ్ ఆప్షన్ ను ఎంపిక చేసుకునంటే సరి. అదే విధంగా,  గూగుల్ ఓమ్నిబాక్స్ ద్వారా యూఆర్ఎల్ ఆధారిత శోధనే కాకుండా గణిత సంబంధిత గణాంకాలను కూడా నిర్వహించుకోవచ్చు

మరింత సమాచారం తెలుసుకోండి: