షియోమీ ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్. ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న రెడ్‌మీ నోట్ 9 సిరీస్ ఇటీవ‌ల షియోవీ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే.  సిరీస్‌లో రెడ్‌‌మీ నోట్ 9 ప్రో, రెడ్‌‌మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేసింది షావోమీ. రెడ్‌మీ నోట్ 9 ప్రో, రెడ్‌మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్ల ఫీచర్లు దాదాపు ఒకేలా ఉన్నాయి. ఈ రెండు ఫోన్లలో ఇస్రోకు చెందిన నావిక్ టెక్నాలజీ ఉంది. స్నాప్‌డ్రాగన్ 720జీ ప్రాససెర్, 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే, 5020 ఎంఏహెచ్ ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి కామన్ ఫీచర్స్ ఉన్నాయి. 

 

అయితే రెడ్‌మీ నోట్ 9 ప్రో 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తే, రెడ్‌మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇక వాస్త‌వానికి రెడ్‌మీ నోట్ 9 సిరీస్‌లో మూడు ఫోన్లను రిలీజ్ చేస్తుందని అనుకున్నా కేవలం రెండు ఫోన్లను మాత్రమే ప్రకటించింది షావోమీ. రెడ్‌మీ నోట్ 9 ప్రో 4జీబీ+64జీబీ, 6జీబీ+128జీబీ వేరియంట్లలో రిలీజైంది. ప్రారంభ ధర రూ.12,999. మార్చి 17న అంటే నేటి నుంచీ సేల్ ప్రారంభమవుతుంది. షావోమీ ఆన్‌లైన్ స్టోర్ అమెజాన్, ఎంఐ హోమ్ స్టోర్లలో లభిస్తాయి.

 

స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే..
రెడ్‌మీ నోట్ 9 ప్రో:
డిస్‌ప్లే- 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+, 2400x1080 పిక్సెల్స్
ఇంటర్నల్ స్టోరేజ్- 64జీబీ, 128జీబీ
ర్యామ్- 4జీబీ, 6జీబీ

 

ప్రాసెసర్- క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720జీ
బ్యాటరీ- 5020 ఎంఏహెచ్
ఫ్రంట్ కెమెరా- 16 మెగాపిక్సెల్ ఇన్ డిస్‌ప్లే కెమెరా
రియర్ కెమెరా- 48 (ప్రైమరీ)+8 (వైడ్ యాంగిల్)+5 (మ్యాక్రో)+2 (డెప్త్) మెగాపిక్సెల్
ధర- 4జీబీ+64జీబీ- రూ.12,999 6జీబీ+128జీబీ- రూ.15,999.

 

మరింత సమాచారం తెలుసుకోండి: