రెడ్‌మీకి ఉన్న క్రేజ్‌.. తాజాగా జ‌రిగిన సేల్ బ‌ట్టీ అర్థం చేసుకోవ‌చ్చు.  రెడ్‌మీ నోట్ 9 సిరీస్ ఇటీవ‌ల షియోవీ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే.  సిరీస్‌లో రెడ్‌‌మీ నోట్ 9 ప్రో, రెడ్‌‌మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేసింది.  కరోనా వైరస్ ప్రభావంతో ఆన్ గ్రౌండ్ ఈవెంట్ క్యాన్సిల్ చేసిన షావోమీ... ఆన్‌లైన్ ఈవెంట్ ద్వారా ఇటీవ‌ల ఈ రెండు ఫోన్లను ఇండియన్ మార్కెట్‌కు పరిచయం చేసింది. ఇక రెడ్‌మీ నోట్ 9 సిరీస్‌లో మూడు ఫోన్లను రిలీజ్ చేస్తుందని అనుకున్నా కేవలం రెండు ఫోన్లను మాత్రమే ప్రకటించింది షావోమీ. 

 

రెడ్‌మీ నోట్ 9 ప్రో, రెడ్‌మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్ల ఫీచర్లు దాదాపు ఒకేలా ఉన్నాయి. వీటిలో రెడ్‌మీ నోట్ 9 ప్రో 4జీబీ+64జీబీ, 6జీబీ+128జీబీ వేరియంట్లలో రిలీజైంది. ప్రారంభ ధర రూ.12,999. నేటి నుంచి దీని సేల్ ప్రారంభమవుతుంది. అయితే  తాజాగా మార్కెట్‌లోకి విడుదల చేసిన రెడ్‌మీ నోట్‌ 9 ప్రో స్మార్ట్‌ఫోన్లు కేవ‌లం 90 సెకన్లలోనే అమ్ముడుపోయి రికార్డు క్రియేట్ చేసింది. ఈ రోజు అమెజాన్ ఇండియాలో నిర్వహించిన ఫస్ట్‌సేల్‌లో ఫోన్‌లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.

 

అమెజాన్‌తో పాటు ఎంఐ డాట్‌కామ్, ఎంఐ హోం, ఎం స్టూడియో స్టోర్లలోనూ ఈ ఫోన్ కొనుగోళ్ల సునామీ సృష్టించింది. దీంతో నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి‌. ఇక స్నాప్‌డ్రాగన్ 720జి ఎస్ఓసీ, 5,020 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి అదనపు ఆకర్షణలు వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

 

స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే..
రెడ్‌మీ నోట్ 9 ప్రో:
డిస్‌ప్లే- 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+, 2400x1080 పిక్సెల్స్
ఇంటర్నల్ స్టోరేజ్- 64జీబీ, 128జీబీ
ర్యామ్- 4జీబీ, 6జీబీ
ప్రాసెసర్- క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720జీ
బ్యాటరీ- 5020 ఎంఏహెచ్
ఫ్రంట్ కెమెరా- 16 మెగాపిక్సెల్ ఇన్ డిస్‌ప్లే కెమెరా
రియర్ కెమెరా- 48 (ప్రైమరీ)+8 (వైడ్ యాంగిల్)+5 (మ్యాక్రో)+2 (డెప్త్) మెగాపిక్సెల్
ధర- 4జీబీ+64జీబీ- రూ.12,999 6జీబీ+128జీబీ- రూ.15,999.

మరింత సమాచారం తెలుసుకోండి: