టెక్నాలజీ మారుతున్నా కొద్దీ కొత్త ఎలక్ట్రికల్ వస్తువులను కనిపెడుతూనే ఉన్నారు. ఎన్నో కొత్త మొబైల్స్ వచ్చాయి. వాటికీ తగ్గటుగా కొత్త పవర్ బ్యాంక్ లను తయారీని అందులో బాటులోకి తీసుకొచ్చారు. మొదటగా కనెక్టర్ తో పవర్ బ్యాంక్ ను లంచ్ చేశారు. షియోమీ ఎట్టకేలకు మనదేశంలో వైర్ లెస్ పవర్ బ్యాంక్ ను లాంచ్ చేసింది. ఈ బ్యాంక్ ఛార్జింగ్ బ్యాటరీ లెవెల్ ని కూడా పెంచారు.

 

ఈ పవర్ బ్యాంకు ద్వారా ఒక్కేసారి రెండు ఫోన్ లకు ఛార్జింగ్ పెట్టవచ్చు. పవర్ బ్యాంక్ బ్యాటరీ లెవెల్స్ 10W ఫాస్ట్ వైర్‌లెస్ చార్జింగ్‌ను సపోర్ట్ చేసే 10000 ఎంఏహెచ్ ఎంఐ వైర్‌లెస్ పవర్ బ్యాంక్‌ను షియోమీ ఇండియా లాంచ్ చేసింది. ఆండ్రాయిడ్ ఫోన్ ల కోసం 10W వైర్‌లెస్ యార్జింగ్‌తో పాటు, సపోర్ట్ చేసే ఐఫోన్ మోడళ్లపై 7.5W వరకు వైర్‌లెస్ చార్జింగ్‌ను అందిస్తుంది.

 

ఈ వైర్ లెస్ పవర్ బ్యాంక్ ద్వారా 18w తో ఫాస్ట్ చార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ పవర్ బ్యాంక్ లో యూఎస్ బీ టైప్-సీ ఇన్ పుట్ ఫీచర్ ను కూడా అందిస్తున్నారు. ఈ పవర్ బ్యాంక్ ద్వారా వైర్‌ లెస్ చార్జింగ్ సపోర్ట్‌తో గ్లోబల్ మార్కెట్లలో షియోమీ ఎంఐ 10, ఎంఐ 9 స్మార్ట్‌ ఫోన్‌లను కలిగి ఉంది. షియోమీలో వైర్‌లెస్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్ మోడల్ భారతదేశంలో లేదు. 

 

ఈ వైర్‌లెస్ పవర్ బ్యాంక్ ను తక్కువ ధరతో రూ.2,499 మొదట ఎంఐ.కామ్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయన్నారు. త్వరలోనే వివిధ వెబ్ సైట్లలో కూడా దీన్ని అమ్మకానికి ఉంచే అవకాశం ఉంది. 

 

ఈ పవర్ బ్యాంక్ లో 12-లేయర్ అడ్వాన్స్‌డ్ చిప్ ప్రొటెక్షన్‌ను ఉపయోగించినట్లు కంపెనీ తెలిపింది. ఈ పవర్ బ్యాంక్ వేడెక్కడం, ఓవర్ కరెంట్, షార్ట్ సర్క్యూట్‌ల వంటి సమస్యలు రాకుండా స్మార్ట్ ఫోన్లను కాపాడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: