దేశ వ్యాప్తంగా అన్ని జాతీయ రహదారులపై ఉండే టోల్‌గేట్ల వద్ద ఫాస్టాగ్ విధానం ఇటీవ‌ల అమ‌ల్లోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. జాతీయ రహదారులపై వాహనదారులు టోల్ చెల్లించడానికి ఈ ఫాస్టాగ్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. రేడియో ఫ్రీక్వెన్సీ గుర్తింపు పరికరం ద్వారా ఈ విధానం పనిచేస్తోంది. బ్యాంకుకు వెళ్లి ఫాస్టాగ్ తీసుకోవచ్చు. ఫాస్టాగ్‌లను యూపీఐ, మై ఫాస్టాగ్ యాప్, నెట్ బ్యాంకింగ్, పేటీఎం వంటి వాటితో రీచార్జ్ చేసుకోవచ్చు.

 

ఫాస్టాగ్ వాలిడిటీ ఐదేళ్లు ఉంటుంది. ఒక్కసారి ఫాస్టాగ్ తీసుకుంటే ఐదేళ్ల అదే పనిచేస్తుంది. అలాగే గూగుల్ ప్లే ద్వారా ఈ  ఫాస్టాగ్ అకౌంట్లను రీఛార్జ్ చేసుకోవ‌చ్చు. రీఛార్జ్ చేయడానికి గూగుల్ పే యూజర్లు చేయవలసినది ఒకటే ఒకటి తమ ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్లను గూగుల్ పే యాప్ కు లింక్ చేయడం. అలా చేయడానికి మీరు గూగుల్ పే యాప్ ను ఓపెన్ చేసి ఫాస్ట్ ట్యాగ్ ఆప్షన్ కోసం చూడండి. దీనిని "బిల్ పెమెంట్స్" విభాగంలో చూడవచ్చు. దీనిని రూపాయి గుర్తుపై క్లిక్ చేయడం ద్వారా క‌నిపిస్తుంది. ఇప్పుడు ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్ ఎంపికను ఎంచుకోండి మరియు మీ ఫాస్ట్ ట్యాగ్ జారీ చేసిన బ్యాంకును ఎంచుకోండి.

 

ఇక ప్రస్తుతానికి గూగుల్ పే కేవలం రెండు ఎంపికలను మాత్రమే అందిస్తుంది. అవి ICICI ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్ మరియు IDFC ఫస్ట్ ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్. ఇక తదుపరి స్క్రీన్ మీద మీ వాహన నంబర్‌ను నమోదు చేసి మీ బ్యాంక్ అకౌంట్ తో చెల్లించడానికి కొనసాగండి. అలాగే యూజ‌ర్స్‌ ఒక బటన్ క్లిక్ చేయ‌డం ద్వారా మద్దతు ఉన్న బ్యాంకులు జారీ చేసిన ఫాస్ట్ ట్యాగ్ల కోసం వారి ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్ బ్యాలెన్స్ ను కూడా తనిఖీ చేయవచ్చు. కాగా, ఫాస్టాగ్ కలిగిన వాహనాలు టోల్‌ప్లాజాల వద్ద ఆగకుండా నేరుగా వెళ్లిపోవచ్చు. ఈ సౌకర్యం కలిగిన వాహనాల కోసం ప్రత్యేక మార్గాన్ని కూడా టోల్‌ప్లాజాల్లో ఏర్పాటుచేశారు. ఇంకెందుకు ఆల‌స్యం ఈ సౌక‌ర్యాన్ని మీరు ఉప‌యోగించుకోండి మ‌రి.

మరింత సమాచారం తెలుసుకోండి: