నేటి స‌మాజంలో స్మార్ట్‌ఫోన్ వినియోగం ఏ రేంజ్‌లో పెరిగిపోయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇంటికొక టీవీ ఉండ‌క‌పోవ‌చ్చేమోగాని.. స్మార్ట్‌ఫోన్ లేని ఇల్లు ఉండ‌డం లేదు. అవ‌స‌రాల‌కు స్మార్ట్‌ఫోన్ ఓ అవ‌స‌రంగా మారిపోయింది. ఏది కావాల‌న్నా.. ఏది కొనాల‌న్నా.. స్మార్ట్‌ఫోన్‌పైనే ఆధార‌ప‌డుతున్నారు. ఇక సాధార‌ణంగా ఒకప్పుడు ఎవరైనా మొబైల్ కొనాలంటే ఆలోచించే అంశాల్లో ముఖ్యమైనవి ధర, ఏ కంపెనీ. అయితే ఇప్పుడు ధ‌ర‌తో పాటు.. స్మార్ట్‌ఫోన్‌కు కెమెరా ఎంత అన్న ప్ర‌శ్న కూడా ఎదురువుతుంది. 

 

ఈ ప్రశ్నకు సరైన సమాధానమే ఉండట్లేదు. ఒకప్పుడు 8 మెగాపిక్సెల్ కెమెరా స్మార్ట్‌ఫోన్ ఉండటమే గొప్ప. కానీ ఇప్పుడు 64 మెగాపిక్సెల్ కూడా వ‌చ్చాయి. అయితే త్వరలో 108 మెగాపిక్సెల్ స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. అవును! 108 ఎంపీ భారీ కెమెరాతో రెండు వేరియంట్లలో ప్రముఖ మైబైల్ కంపెనీ షావోమి కొత్త స్మార్ట్‌ఫోన్లను రిలీజ్‌ చేయనుంది. చైనాలో ఫిబ్రవరిలోనే షావోమీ ఎంఐ 10 స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. ఇండియాకు ఎప్పుడెప్పుడు వస్తుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. 

 

దీంతో రిలీజ్ డేట్‌ను షావోమీ ఇండియా కన్‌ఫామ్ చేసింది. మార్చి 31న షావోమీ ఎంఐ 10 స్మార్ట్‌ఫోన్‌ను భార‌త్‌లో రిలీజ్ చేస్తున్నట్టు ప్ర‌క‌టించింది. ఎంఐ 10 స్మార్ట్‌ఫోన్‌లో 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, వైర్‌లెస్ ఛార్జింగ్, వైఫై 6 సపోర్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. రూ. 42,400 నుంచి ప్రారంభం కానుందని తెలుస్తోంది. అంతేకాకుండా.. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఏప్రిల్‌ 7వ తేదీ రాత్రి 11 గంటల 59 నిమిషాల వరకు కస్టమర్లు ప్రీ ఆర్డర్లు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అమెజాన్‌ ఆన్‌లైన్‌లో సేల్‌‌లో ఈ స్మార్ట్‌‌ఫోన్‌‌ను బుక్ చేసుకోవచ్చు.

 

షావోమీ ఎంఐ 10 స్పెసిఫికేషన్స్ ప‌రిశీలిస్తే.. 
-6.67 అంగుళాల డిస్‌ప్లే
-ఆండ్రాయిడ్‌ 10
-8జీబీ ర్యామ్‌, 256 స్టోరేజ్‌
-4780 బ్యాటరీ సామర్థ్యం 
-12 జీబీ ర్యామ్‌, 512 స్టోరేజ్‌
-క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865 సాక్‌ప్రాసెసర్
-108+13+ 2+2 ఎంపీ క్వాడ్‌ రియర్‌ కెమరా
-1080×2340 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
-20 ఎంపీ సెల్పీ కెమెరా

మరింత సమాచారం తెలుసుకోండి: