వాట్సాప్‌.. పెద్ద‌గా ప‌రిచయం అవ‌స‌రం లేని పేరు. అంత‌లా వాట్సాప్‌కు క్రేజ్ ఏర్ప‌డింది కాబ‌ట్టి. స్మార్ట్‌ఫోన్ల ధరలు తగ్గడం, డేటా కోసం పెట్టే ఖర్చు తక్కువగా ఉండటం, సామాజిక మాధ్యమాలపై వెచ్చించే సమయం ఎక్కువ కావడం రోజువారీ వాట్సాప్‌ వినియోగం పెరిగేందుకు కార‌ణం అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరూ రోజు వారీ అవసరాలకు, ఆఫీస్ ల్లో కమ్యూనికేషన్ కోసం ఇలా వివిధ రకాలుగా ఉపయోగిస్తున్నారు. అయితే వాట్సాప్ లో అందరికీ తెలియని ఫీచర్స్, ట్రిక్స్ ఎన్నో ఉన్నాయి. 

 

అలాగే వాట్సాప్ ట్రిక్ ద్వారా వాట్సాప్ లో మెసేజ్ లను పంపినవారికి మనం మెసేజ్ లను చదివినట్లు తెలియకుండా వారికీ నీలిరంగు టిక్ లను కనబడకుండా ఉండడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. అందుకు ముందుగా ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ యూజర్లు ఇద్దరూ తమ ఫోన్‌లో వాట్సాప్ మెసేజ్ కనిపించే వరకు వేచి ఉండాలి.  ఇక మీకు మెసేజ్ వచ్చిన‌ట్టు నోటిఫికేషన్‌లను అందుకున్న తర్వాత వారు తప్పకుండా పాస్‌కోడ్, ఫేస్‌ఐడి లేదా పాట్రన్ లాక్‌ని ఉపయోగించి స్మార్ట్‌ఫోన్‌ను అన్‌లాక్ చేసుకోవాలి.

 

ఫోన్ అన్‌లాక్ అయిన తర్వాత వారు అందుకున్న నోటిఫికేషన్‌ను కొంచెం ఎక్కువసేపు నొక్కాలి. అప్పుడు స్వీకరించిన మెసేజ్ విస్తరించి పెద్దది అవుతుంది. అంతేకాకుండా వినియోగదారుడు యాప్ ను ఓపెన్ చేయకుండానే మరియు పంపినవారికి బ్లూ టిక్‌లను చూపకుండా మెసేజ్ లను పూర్తిగా చదవగలరు. ఈ ఫీచర్ ను ఉపయోగించడానికి ముందు మీరు చదివే నోటిఫికేషన్‌ను స్వైప్ చేయకుండా చూసుకోండి. ఎందుకంటే స్వైప్ చేసిన మెసేజ్‌ల‌ను చ‌ద‌వ‌లేరు.

మరింత సమాచారం తెలుసుకోండి: