చైనాలో విధ్వంసం సృష్టించిన క‌రోనా వైర‌స్‌.. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల‌ను గ‌డ‌గ‌డ‌లాడిస్తుంది.  కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రజలు ప్రాణభయంతో వణికిపోతున్నారు. తుమ్మినా, దగ్గినా కరోనానే అనే అనుమానంతో బెంబేలెత్తిపోతున్నారు. అయితే మ‌నం నిత్యం చేతిలో ప‌ట్టుకునే స్మార్ట్‌ఫోన్‌పై కూడా క‌రోనా వైర‌స్ ఉండోచ్చు. క‌రోనా వైర‌సే కాదు.. ఇత‌రిత‌ర వైర‌స్‌లు కూడా ఫోన్‌పై ఉంటాయి. కానీ, ఈ విష‌యం చాలా మందికి తెలియ‌దు.

 

అందుకే  మీ స్మార్ట్‌ఫోన్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవ‌డం చాలా మంచిది. స్మార్ట్‌ఫోన్ మాత్రమే కాదు, మీ మొబైల్‌కు ఉండే కేస్‌ని కూడా క్లీన్ చేయడం అవసరం. అందుకు ముందుగా మీ మొబైల్ కేస్‌ని వేరు చేసి రబ్బింగ్ ఆల్కహాల్ లేదా క్లీనింగ్ స్ప్రే ఉపయోగించి మీ స్మార్ట్‌ఫోన్‌ కేస్‌ను శుభ్రం చేయొచ్చు. రబ్బింగ్ ఆల్కహాల్‌లో మెత్తటి క్లాత్ ముంచి ఆ క్లాత్‌తో కేస్ శుభ్రం చేయాలి. ఒకవేళ డిజైన్ ఉండే కేస్‌లు ఉపయోగిస్తున్నట్టైతే కాస్త‌ జాగ్రత్తగా శుభ్రం చేసుకోవాలి. ఇక స్మార్ట్‌ఫోన్‌ను క్లీన్ చేసే ముందు స్విచ్చాఫ్ చేసి క్లీనింగ్ ప్రోసెస్‌ను ఫాలో అవ్వాలి.

 

క్లీన్ చేయ‌మ‌న్నారు క‌దా అని.. స‌ర‌స‌రి ట్యాప్ వాటర్‌తో మీ స్మార్ట్‌ఫోన్‌ను క్లీన్ చేస్తే.. ఎంత వాటర్ రెసిస్టెంట్‌తో ముందు ముందు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. స్మార్ట్‌ఫోన్‌కు కూడా రబ్బింగ్ ఆల్కహాల్ లేదా ఆల్కహాల్ బేస్డ్‌ డిస్‌ఇన్‌ఫెక్టెంట్ స్ప్రే ఉపయోగించాలి. మొత్త‌టి క్లాత్‌తో మీ స్మార్ట్‌ఫోన్ ముందువైపు, వెనుకవైపు క్లీన్ చేసుకోవాలి. 

 

మ‌రియు  స్క్రీన్ పైన శుభ్రం చేసేప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. లేకపోతే డిస్‌ప్లే దెబ్బతినే అవకాశం ఉంది. మీ స్మార్ట్‌ఫోన్‌ను క్లీన్ చేసిన తర్వాత ఫోన్‌పైన ఎక్కడా తడి లేకుండా చూడాలి. ఆ తర్వాతే ఫోన్ స్విచ్ఛాన్ చేయాలి. ఇలా మీ స్మార్ట్‌ఫోన్‌ను తరచూ క్లీన్ చేయడం ఉత్తమం. ఎందుకంటే ప్ర‌స్తుతం క‌రోనా వ్యాప్తి ఎక్కువ‌గా ఉంది. కాబ‌ట్టి వ్య‌క్తిగ‌త శుభ్రంతో పాటు మ‌నం యూజ్ చేసే వ‌స్తువ‌ల‌ను కూడా క్లీన్‌గా పెట్టుకోవాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: