క‌రోనా వైర‌స్ లేదా కోవిడ్‌-19.. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌ను గ‌జ‌గ‌జ‌లాడిస్తుంది. ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా.. ఎక్క‌డోక‌క్క‌డ క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయి. ఇక కరోనా వైరస్ భయంతో ప్రపంచంలోని అనేక దేశాలలోని ప్రజలు ఇంటిపట్టునే ఉండిపోవడంతో నగరాలు నిర్మానుష్యంగా మారుతున్నాయి. కొన్ని దేశాలలో ప్రజా కదలిక పై ప్రభుత్వాలు నిషేధం విధిస్తే మరి కొన్ని చోట్ల ప్రజలు స్వీయ నిర్బంధంలోకి వెళుతున్నారు. ఇప్ప‌టికే ఈ వైర‌స్ కార‌ణంగా వేల మంది చ‌నిపోవ‌డం.. ల‌క్ష‌ల్లో దీని భారిన ప‌డ‌డంతో ప్ర‌జ‌లు తీవ్రంగా భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. 

 

అయితే మీకు.. మీ కుటుంబం స‌భ్యుల‌కు క‌రోనా వ‌చ్చే ప్ర‌బాదం ఉందో.. లేదో.. అన్న ప్రశ్నలకు సమాధానాలను సులువుగా తెలుసుకునేందుకు మైజియో కరోనావైరస్ టూల్‌ను ప్రారంభించింది రిలయెన్స్ జియో. అంతేకాదు... https://www.jio.com/ వెబ్‌సైట్‌లో కూడా తెలుసుకోవచ్చు. ఈ టూల్ ద్వారా మీకు లేదా మీ కుటుంబ సభ్యులు, స్నేహితులకు కరోనా వైరస్ సోకే ప్రమాదం ఎంత ఉందని సులువుగా తెలుసుకోవచ్చు. ఇందులో ఉండే ప్రశ్నలకు మీరు ఇచ్చే సమాధానాలను బట్టి మీ రిస్క్ స్టేటస్ తెలుస్తుంది. 

 

లో రిస్క్, మాడరేట్ రిస్క్, హై రిస్క్ అని మీ రిస్క్ స్టేటస్‌ని వివరిస్తుంది. అలాగే మీరు తీసుకోవాల్సిన చర్యలను కూడా వివరిస్తుంది. ఇక కేవలం జియో యూజర్లు మాత్రమే కాదు... నాన్-జియో కస్టమర్లు కూడా కోవిడ్-19 డయాగ్నస్టిక్ టూల్‌ను ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం ఇంగ్లీష్ భాషలోనే ఈ టూల్ అందుబాటులో ఉంది. త్వరలో హిందీతో పాటు ఇతర భారతీయ భాషల్లో అందుబాటులోకి రానుంది. కాబ‌ట్టి.. వెంట‌నే ఈ యాప్‌ను యూజ్ చేసుకోండి.


 
 

మరింత సమాచారం తెలుసుకోండి: